Suma: థియేటర్‌లో పంచాయితీకి సిద్ధమైన సుమ

యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించిన సుమ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్‌ కుమార్‌ దర్శకుడు...

Published : 14 Mar 2022 12:02 IST

హైదరాబాద్‌: యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించిన సుమ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్‌ కుమార్‌ దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఈ సినిమా విడుదల తేదీపై సోమవారం ఉదయం సుమ అప్‌డేట్‌ ఇచ్చారు. మార్చి నెలలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ఏప్రిల్‌ రెండో వారంలో ‘కేజీఎఫ్‌-2’, ఏప్రిల్‌ చివర్లో ‘ఆచార్య’, మేలో ‘సర్కారువారి పాట’.. ఇలా వరుస స్టార్‌ హీరోల సినిమాలు రానున్న తరుణంలో.. ఏప్రిల్‌ 22న ‘జయమ్మ పంచాయితీ’ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈసినిమాలో సుమ.. గడుసైన గ్రామీణ మహిళగా కనిపించనున్నారు. పల్లెటూరి మహిళగా ఆమె భాష, లుక్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది. కీరవాణి స్వరాలు అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని