Sumalatha: సీనియర్‌ నటి సుమలత కుమారుడి పెళ్లి.. సినీ, రాజకీయ ప్రముఖుల సందడి

సీనియర్‌ నటి సుమలత (Sumalatha) ఇంట పెళ్లి వేడుక జరిగింది. ఆమె కుమారుడు అభిషేక్‌ ఓ ఇంటివాడు అయ్యాడు.

Published : 05 Jun 2023 14:10 IST

బెంగళూరు: సీనియర్‌ నటి, కర్ణాటక ఎంపీ సుమలత (Sumalatha) కుమారుడు అభిషేక్‌ వివాహం ఘనంగా జరిగింది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రసాద్‌ బిదపా కుమార్తె అవివాతో ఆయన పెళ్లి జరిగింది. బెంగళూరులోని ఓ ప్రముఖ ప్యాలెస్‌ వీరి వివాహానికి వేదికైంది. సోమవారం ఉదయం జరిగిన ఈ పెళ్లి వేడుకలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రజనీకాంత్‌, మోహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. వీటిని చూసిన నెటిజన్లు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

చిన్న వయసులోనే నటిగా అడుగుపెట్టిన సుమలత.. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ పరిశ్రమల్లో నటించింది. ఈ క్రమంలోనే కన్నడ నటుడు అంబరీశ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. అంబరీశ్‌ మరణం తర్వాత ఆమె ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు