Updated : 04 Jul 2022 07:49 IST

Sumanth: సుమంత్‌.. కొత్త కబురు

హీరో సుమంత్‌ (Sumanth) కొత్త కబురు వినిపించారు. సంతోష్‌ జాగర్లపూడి(Santosh Jagarlamudi) దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించారు.‘సుబ్రహ్మణ్యపురం’ (Subrahmanyapuram) తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. దీన్ని కె.ప్రదీప్‌ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘‘పురాతన దేవాలయం నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందనుంది. ఆద్యంతం ఆసక్తిరేకెత్తిస్తూ.. థ్రిల్‌ పంచుతుంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. త్వరలో చిత్రీకరణ మొదలవుతుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని