ముందు ఆ బ్రేకప్‌ నుంచి బయటపడాలి.. తర్వాతే పెళ్లి అంటోన్న నటి

తన పెళ్లి గురించి నటి సునయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను ప్రస్తుతం చేస్తోన్న సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా పంచుకొన్నవిశేషాలివే

Published : 18 Nov 2022 14:45 IST

హైదరాబాద్‌: సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. హన్సిక, మంజిమా మోహన్‌, నాగశౌర్య ఇప్పటికే తమ వివాహ తేదీలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో నటి సునయన (Sunaina) సైతం తన పెళ్లి గురించి ఆసక్తికర ట్వీట్‌ చేసింది. ‘రాజ రాజ చోర’తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తాజాగా తన వివాహంపై స్పందించింది. ‘మేడమ్‌ మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘‘ఆ హార్ట్‌బ్రేక్‌ (బ్రేకప్‌ని ఉద్దేశిస్తూ) నుంచి ముందు బయటపడనివ్వండి’’ అని బదులిచ్చింది. ఈ ట్వీట్‌ కాస్త వైరల్‌గా మారింది. ‘‘బాధపడకండి. కచ్చితంగా ఆ బాధను అధిగమిస్తారు’’ అని నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు.

పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి.. కథానాయికగా రాణిస్తోంది సునయన. ప్రస్తుతం ఓటీటీలోనూ అవకాశాలు వస్తున్నాయి. ఆమె కీలకపాత్రలో నటిస్తోన్న వెబ్‌సిరీస్‌ ‘మీట్‌ క్యూట్‌’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల ఆమె ట్విటర్‌ చాట్‌ నిర్వహించి.. తన పెళ్లి గురించి స్పందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని