Cinema News: సుందరాంగుడి సందడి

కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి శర్మ ప్రధాన పాత్రధారులుగా... వినయ్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సుందరాంగుడు’. చందర్‌గౌడ్‌, యం.యస్‌.కె.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఫిబ్రవరిలో  ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా

Updated : 27 Jan 2022 07:01 IST

కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి శర్మ ప్రధాన పాత్రధారులుగా... వినయ్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సుందరాంగుడు’. చందర్‌గౌడ్‌, యం.యస్‌.కె.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఫిబ్రవరిలో  ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం బుధవారం  హైదరాబాద్‌లో జరిగింది.  ఈ సందర్భంగా కథానాయకుడు    మాట్లాడుతూ ‘‘వినూత్నమైన ప్రేమకథతో    తెరకెక్కిన చిత్రమిది. మేం ఏర్పాటు చేసిన కృష్ణసాయి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ తరఫున చాలా మందికి సాయం చేస్తున్నా. ఈ సినిమాతో వచ్చిన లాభాల్ని మా ట్రస్ట్‌ చేపడుతున్న సేవా కార్యక్రమాల కోసం ఉపయోగిస్తాం. అండగా నిలిచేవాళ్లు లేక విడుదల చేసుకోలేకపోతున్నాం. చిన్న సినిమాల విడుదలకి పరిశ్రమ పెద్ద సహకారం అందించాలని కోరుతున్నాం’’ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని