SundeepKishan: ‘గల్లీరౌడీ’.. రెడీ

 ‘గల్లీరౌడీ’గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌. జి.నాగేశ్వర రెడ్డి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. నేహా శెట్టి నాయికగా. బాబీ సింహా కీలక పాత్రలో కనిపించనున్నారు

Published : 28 Jun 2021 13:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘గల్లీరౌడీ’గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌. జి.నాగేశ్వర రెడ్డి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. నేహా శెట్టి నాయికగా. బాబీ సింహా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తాజాగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకుని, సెన్సార్‌ కార్యక్రమాల కోసం సిద్ధమవుతోంది. ‘గల్లీరౌడీ ఈజ్‌ రెడీ’ అంటూ ఈ విషయాన్ని ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చౌరస్తా రామ్‌, సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘పుట్టెనే ప్రేమ..’ అనే పాట, టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని