Sundeep Kishan: రిలేషన్‌షిప్‌ నాకు సెట్‌ కాదు.. బ్రేకప్‌ దెబ్బ గట్టిగా తగిలింది: సందీప్‌ కిషన్‌

చాలా రోజుల తర్వాత ‘మైఖేల్‌’ (Michael)గా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తున్నారు నటుడు సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan). యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొన్న ఆయన.. తన లైఫ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 05 Feb 2023 12:35 IST

హైదరాబాద్‌: ప్రేమ అనే కాన్సెప్ట్ తనకు సెట్‌ కాదని నటుడు సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) అన్నారు. ప్రస్తుతానికి తాను ఎవరితోనూ ప్రేమలో లేనని తెలిపారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా రిలేషన్‌లోకి వెళ్తానన్నారు. ‘మైఖేల్‌’ (Michael) ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తాను బ్రేకప్‌ బాధను చూశానని అన్నారు.

‘‘ప్రస్తుతానికి నేను రిలేషన్‌షిప్‌లో లేను. అది నాకు సెట్‌ కాదు. నేను చాలా ఎమోషనల్‌. నా భాగస్వామి మీద ఎక్కువగా ఆధారపడతాను. అన్నివిషయాల్లో తన అభిప్రాయం తీసుకోవాలనుకుంటాను. ఎప్పుడూ తనతోనే మాట్లాడాలని, తనకే సమయం కేటాయించాలని భావిస్తాను. అంత ఈజీగా వదులుకోలేను. కాబట్టి.. నాలాంటి వ్యక్తికి రిలేషన్‌ చాలా డేంజరస్‌. అందరిలాగానే గతంలో నాక్కూడా ప్రేమలో ఎదురుదెబ్బలు తగిలాయి. గతేడాది బ్రేకప్‌ దెబ్బ గట్టిగానే తగిలింది’’ అని సందీప్‌ వివరించారు. ఓ నటితో తాను రిలేషన్‌లో ఉన్నట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ఆమె తనకి మంచి స్నేహితురాలు మాత్రమేనని తెలిపారు. లాక్‌డౌన్‌ తర్వాత మనుషుల మనస్తత్వంలో ఎంతో మార్పు వచ్చిందని, ఇప్పుడున్న రోజుల్లో ఒక బంధాన్ని కాపాడుకోవడం కష్టమైన పని అని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని