Sundeep Kishan: ఊరు పేరు భైరవకోన

సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా హాస్య మూవీస్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలు. వి.ఐ.ఆనంద్‌ దర్శకుడు. రాజేష్‌ దండా నిర్మాత. అనిల్‌ సుంకర సమర్పకులు.

Updated : 08 May 2022 10:24 IST

సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా హాస్య మూవీస్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలు. వి.ఐ.ఆనంద్‌ దర్శకుడు. రాజేష్‌ దండా నిర్మాత. అనిల్‌ సుంకర సమర్పకులు. చిత్రానికి ‘ఊరు పేరు భైరవకోన’ అనే పేరుని ఖరారు చేశారు. సోమవారం సందీప్‌కిషన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌తోపాటు, మేకింగ్‌ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. ‘‘దర్శకుడు ఈ చిత్రంతో ప్రేక్షకుల్ని ఓ ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళతారు’’ అని సినీ వర్గాలు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రాజ్‌ తోట, సంగీతం: శేఖర్‌ చంద్ర, కూర్పు: ఛోటా కె.ప్రసాద్‌, కళ: ఎ.రామాంజనేయులు, సంభాషణలు: భాను భోగవరపు, నందు సవిరిగాన.


‘మైఖేల్‌’ లుక్‌

సందీప్‌కిషన్‌ పుట్టినరోజు సందర్భంగా శనివారం ‘మైఖేల్‌’ సినిమా లుక్‌ విడుదలైంది. రంజిత్‌ జయకోడి దర్శకత్వంలో సందీప్‌కిషన్‌, విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ మేనన్‌ ప్రధాన పాత్రధారులుగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దివ్యాంశ కౌశిక్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, వరుణ్‌సందేశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నారాయణ్‌దాస్‌ నారంగ్‌, భరత్‌ చౌదరి, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం సందీప్‌కిషన్‌ సిక్స్‌ ప్యాక్‌ దేహాన్ని సిద్ధం చేసి నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని