Suniel Shetty: కంటెంట్‌ కోసం వర్క్ చేయాలి: సునీల్‌ శెట్టి

‘ఇకపై హిందీ జాతీయ భాష కాదం’’టూ కొంతకాలం క్రితం కన్నడ నటుడు సుదీప్‌ చేసిన వ్యాఖ్యలతో బాలీవుడ్‌, దక్షిణాది చిత్రపరిశ్రమల మధ్య కొన్నిరోజులపాటు మాటల..

Published : 12 May 2022 16:25 IST

ముంబయి: ‘‘ఇకపై హిందీ జాతీయ భాష కాదం’’టూ కొంతకాలం క్రితం కన్నడ నటుడు సుదీప్‌ చేసిన వ్యాఖ్యలతో బాలీవుడ్‌, దక్షిణాది చిత్రపరిశ్రమల మధ్య కొన్నిరోజులపాటు మాటల యుద్ధం సాగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సుదీప్‌-అజయ్‌ దేవ్‌గణ్‌ల మధ్య జరిగిన ట్వీట్స్‌ వార్‌ మర్చిపోకముందే  ‘మేజర్‌’ ట్రైలర్‌ ఈవెంట్‌లో మహేశ్‌బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు తమ స్పందన తెలియజేస్తున్నారు. దీంతో మరోసారి ‘బాలీవుడ్‌ వర్సెస్‌ సౌత్‌ ఇండస్ట్రీ’ అనే టాపిక్‌ తెరపైకి వచ్చిందని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి తాజాగా స్పందించారు. 

‘‘బాలీవుడ్‌ వర్సెస్‌ సౌత్‌ ఇండస్ట్రీ అనేది సోషల్‌మీడియాలోనే క్రియేట్‌ అయ్యిందనుకుంటున్నా. మనమంతా భారతీయులం. ఏ ఇండస్ట్రీ అనేది పక్కన పెడితే.. ఓటీటీలో కేవలం కంటెంట్‌కి మాత్రమే పెద్ద పీట వేస్తున్నారు. మంచి కంటెంట్‌ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా అభిమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సినిమా చూడాలి, ఎలాంటి సినిమా చూడొద్దనేది పూర్తిగా ఆడియన్స్‌ ఇష్టం. ఇప్పుడున్న రోజుల్లో ప్రేక్షకుల్ని మనం మర్చిపోతున్నామనిపిస్తుంది. మనం వాళ్లకి మంచి కంటెంట్‌ ఇవ్వాలేకపోతున్నామని భావిస్తున్నా. కాబట్టి ఇకపై కంటెంట్‌కు సంబంధించిన మనం ఎక్కువగా వర్క్‌ చేయాల్సి ఉంది. అలాగే,  నేను దక్షిణాది నుంచి వచ్చాను. కానీ, నా కర్మ భూమి ముంబయి. ఇరు ప్రాంతాల వాళ్లూ నన్ను అభిమానిస్తున్నారు’’ అని సునీల్‌శెట్టి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని