Sunny leone: మంచు విష్ణు సినిమాలో సన్నీ లియోన్‌

మంచు విష్ణు హీరోగా  ‘గాలి నాగేశ్వరరావు’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇషాన్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందుతోంది.

Updated : 07 Mar 2022 17:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మంచు విష్ణు హీరోగా ‘గాలి నాగేశ్వరరావు’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇషాన్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందుతోంది. ‘ఆర్‌ఎక్స్‌100’ భామ పాయల్‌ రాజ్‌పుత్‌ ఇందులో కథానాయికగా ఎంపిక కాగా.. మరో కీలక పాత్రలో బాలీవుడ్‌ భామ సన్నీ లియోన్‌ కనిపించనున్నారు. రేణుక అనే పాత్రలో తాను నటిస్తున్నట్టు సోమవారం ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ప్రముఖ రచయిత కోన వెంకట్‌ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చడంతోపాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందిస్తున్నారు. సన్నీ లియోన్‌ గతంలో మంచు మనోజ్‌ హీరోగా నటించిన ‘కరెంట్ తీగ’ సినిమాలో తళుక్కున మెరిసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని