Sunny Leone: సవాల్‌గా స్వీకరించి ‘జిన్నా’ చేశా

‘‘నాకు సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కథలంటే ఇష్టం. ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం అదే’’ అన్నారు సన్నీలియోన్‌. ఆమె ఓ కథానాయికగా నటించిన చిత్రం ‘జిన్నా’. మంచు విష్ణు కథానాయకుడు.

Updated : 19 Oct 2022 11:02 IST

‘‘నాకు సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కథలంటే ఇష్టం. ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం అదే’’ అన్నారు సన్నీలియోన్‌ (Sunny Leone). ఆమె ఓ కథానాయికగా నటించిన చిత్రం ‘జిన్నా’ (Ginna). మంచు విష్ణు (Manchu Vishnu) కథానాయకుడు. పాయల్‌ రాజ్‌పూత్‌ మరో కథానాయిక. చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సన్నీలియోన్‌ ‘జిన్నా’ ప్రయాణం గురించి ఇటీవల విలేకర్లతో పంచుకున్నారు. ఆ విషయాలివీ..

తెలుగులో నేను చేసిన తొలి పూర్తిస్థాయి చిత్రమిదే. రేణుక అనే బధిర యువతి పాత్రలో కనిపిస్తా. నటనకి ప్రాధాన్యమున్న ఈ పాత్రని సవాల్‌గా స్వీకరించి చేశా. లాక్‌డౌన్‌లో ఈ కథ విన్నా. విభిన్నమైన కథాంశంతో కూడిన ఈ సినిమా చేయాలని అప్పుడే నిర్ణయానికొచ్చా.  

దక్షిణాది ప్రేక్షకులు చూపే అభిమానం అంటే ఎంతో ఇష్టం. ఒక నటిగా నాకు తెలుగు, తమిళం, మలయాళ చిత్ర పరిశ్రమలతో మరింత సాన్నిహిత్యం పెరిగింది. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నా. అనురాగ్‌ కశ్యప్‌తో కలిసి చేస్తున్న హిందీ సినిమాలో
డీ గ్లామర్‌ పాత్ర పోషిస్తున్నా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని