Sunny Leone: రేణుక పాత్రలో సన్నీలియోన్‌

‘జిన్నా’ కోసం మంచు విష్ణుతో జోడీ కట్టింది సన్నీలియోన్‌. కథా  నాయకుడి బాల్య స్నేహితురాలిగా...  రేణుక అనే పాత్రలో నటిస్తోంది. బుధ   వారమే ఆ పాత్రకి సంబంధించిన లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం.

Updated : 11 Aug 2022 11:56 IST

‘జిన్నా’ (GINNA) కోసం మంచు విష్ణుతో (Manchu Vishnu) జోడీ కట్టింది సన్నీలియోన్‌ (Sunny Leone). కథా  నాయకుడి బాల్య స్నేహితురాలిగా...  రేణుక అనే పాత్రలో నటిస్తోంది. బుధ   వారమే ఆ పాత్రకి సంబంధించిన లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఈషాన్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మంచు విష్ణు సరసన సన్నీ లియోన్‌తోపాటు, పాయల్‌ రాజ్‌పూత్‌ నటించారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తన పాత్ర గురించి సన్నీలియోన్‌ సామాజిక మాధ్యమాల వేదికగా పలువిషయాల్ని పంచుకుంది. ఊహించని మలుపులతో సాగే ఈ సినిమాలో నటించడం ఓ మంచి అనుభవం అని పేర్కొంది ఆమె. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని