వలస కార్మికుల కోసం 10వేల భోజనాలు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా రెండో దశతో కొవిడ్ కేసులు పెద్దఎత్తున నమోదు అవుతున్నాయి. ఈ సందర్భంగా చాలామంది వలస కార్మికులు తిండిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి కోసం బాలీవుడ్ నటి సన్నీ లియోని పెటా (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) ఇండియాతో కలిసి ఉదయ్‌ ఫౌండేషన్‌ ద్వారా పదివేల మందికి భోజనాలను విరాళంగా ఇవ్వడానికి సిద్ధమైంది.

Published : 06 May 2021 15:45 IST

న్యూధిల్లీ: కరోనా రెండో దశతో పెద్ద ఎత్తున కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో చాలామంది వలస కార్మికులు తిండిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి కోసం బాలీవుడ్ నటి సన్నీ లియోని, పెటా (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) ఇండియాతో కలిసి ఉదయ్‌ ఫౌండేషన్‌ ద్వారా పదివేల మందికి భోజనాలను అందించేందుకు ముందుకు వచ్చింది. దిల్లీలోని వలస కార్మికులకు ఈ శాకాహార భోజనాన్ని అందించనున్నారు.

సన్నీ లియోని స్పందిస్తూ..‘‘మనం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కరుణ, సంఘీభావంతో ముందుకు నడవాలి. పెటా ఇండియాతో పనిచేసేందుకు ముందుకు వస్తున్నాం. వారితో కలిసి మరోసారి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈసారి వేలాది  వలస కార్మికులకు ప్రొటీన్‌తో కూడిన ఆహారం అవసరం.’’ అని తెలిపింది. సన్నీ 2016లో పెటా ఇండియా పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికైంది. సన్నీ లియోని బాలీవుడ్‌లో ‘జిస్మ్ 2’ చిత్రంతో తెరంగేట్రం చేసింది. తర్వాత పలు సినిమాల్లో నటించించి అలరించింది. ప్రస్తుతం ఆమె మలయాళంలో ‘షెరో’, ‘రంగీలా’లో నటిస్తోంది. తెలుగు, హిందీలో తెరకెక్కుతున్న ‘హెలెన్‌’, కోకా కోలా’వంటి సినిమాల్లో నటిస్తోంది. 


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts