Sunny Leone: చంపేస్తామని బెదిరించారు.. భారత్‌కు వస్తాననుకోలేదు : సన్నీ లియోని

ప్రముఖ నటి సన్నీ లియోని(Sunny Leone) గతంలో బెదిరింపులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. కెనడా నుంచి భారత్‌కు వస్తానని అనుకోలేదని చెప్పింది.

Updated : 26 Dec 2022 14:20 IST

హైదరాబాద్‌: మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమాలో కనిపించి మరోసారి తెలుగు తెరపై అలరించింది సన్నీ లియోని(Sunny Leone). తాజాగా ఒక తమిళ చిత్రం ప్రమోషన్‌లో మాట్లాడిన ఈ అమ్మడు.. తన గతానికి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకుని భావోద్వేగానికి గురైంది. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో బెదిరింపులు వచ్చేవని.. అసలు భారతదేశంలోకి వస్తానని అనుకోలేదని పేర్కొంది.

‘‘నా కెరీర్‌ ప్రారంభంలో నాకు బెదిరింపు మెయిల్స్‌ వచ్చేవి. చంపేస్తామంటూ కొంతమంది మెసెజ్‌లు పంపేవాళ్లు. ఎక్కువగా భారత్‌ నుంచి వచ్చేవి. దీంతో ఇక్కడి ప్రజలు నాపై చాలా కోపంగా ఉన్నారని అనుకున్నా. ఆ బెదిరింపులు నన్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అప్పుడు నా వయసు 20 ఏళ్లు. ఆ సమయంలో నాకు మంచిచెడులు చెప్పడానికి ఎవరూ లేరు. అలాంటివి ఇప్పుడు ఎదురైతే అవి నన్ను అంత ప్రభావితం చేయవు. ఎందుకంటే ఇప్పుడు నేను మానసికంగా చాలా బలంగా ఉన్నాను’ అని సన్నీ లియోని స్పష్టం చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే త్వరలోనే  ఆమె అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో నటించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని