Cinema News: నెట్టింట్లో సన్నీలియోనీ పిక్ వైరల్..
ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ దబూరత్నానీ.. మరోసారి తన కెమెరాపనితనంతో నెటిజన్లను ఫిదా చేశారు. ‘దబూ రత్నానీ క్యాలెండర్’ పేరుతో...
తారల స్టన్నింగ్ లుక్స్‌తో డబూ రత్నానీ ఫొటోషూట్
ముంబయి: ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ.. మరోసారి తన కెమెరాతో నెటిజన్లను ఫిదా చేశారు. ‘డబూ రత్నానీ క్యాలెండర్’ పేరుతో ఆయన ప్రతి ఏటా సెలబ్రిటీ ఫొటోలతో స్పెషల్ క్యాలెండర్‌ను విడుదల చేస్తున్న విషయం విదితమే. బాలీవుడ్‌కు చెందిన విద్యాబాలన్, అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్, సన్నీలియోనీ, ఆలియాభట్, శ్రద్ధాకపూర్, హృతిక్‌రోషన్ వంటి స్టార్ల స్టన్నింగ్ లుక్స్‌తో ఈ ఏడాది క్యాలెండర్ సిద్ధమైంది.
త్వరలో ఆవిష్కృతం కానున్న క్యాలెండర్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. విక్కీ కౌశల్, అభిషేక్ బచ్చన్.. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు ఆకట్టుకోగా.. విద్యాబాలన్, సన్నీలియోనీ కిల్లింగ్ లుక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరోవైపు టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ, బీటౌన్ బ్యూటీ తారా సుతారియా మొదటిసారి ఈ క్యాలెండర్లో భాగమయ్యారు. మరి, రౌడీ లుక్స్ ఎలా ఉంటాయో చూడాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్‌రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు