Ginna: ఆయన లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు: సన్నీ లియోన్‌

ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందిన సినిమా జిన్నా. ఈ సినిమాలో సన్నీ లియోన్‌ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ పాత్ర బాగా రావడం కోసం ఆమె ఎంత కష్టపడిందో ఓ మీడియాకు తెలిపింది. 

Published : 30 Oct 2022 11:57 IST

హైదరాబాద్‌: మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘జిన్నా’(Ginna). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి కాలక్షేపాన్నిచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలో సన్నీలియోని(Sunny Leone) నటన అందరినీ ఆకట్టుకుంది. తెలుగు రాని ఈ అమ్మడు మూగ, చెవిటి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. అయితే, ఈ పాత్ర కోసం తను ఎంతగా కష్టపడిందో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది సన్నీ.

‘‘సినిమాలో నా పాత్ర గురించి తెలుసుకోగానే నేను ఒక కోచ్‌ను నియమించుకొని కొన్ని వారాల పాటు సైన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకున్నాను. దర్శకుడు, రచయితతో మాట్లాడి కథను అర్థం చేసుకున్నాను. కానీ, నా పాత్రను వెండితెరపై ఆవిష్కరించడమే అసలైన సవాలు. ఈ విషయంలో నా కోచ్‌ ఎంతో సహాయపడ్డారు. సైన్‌ లాంగ్వేజ్‌కు సంబంధించిన ఎన్నో పుస్తకాలు, వీడియోలు నాకు పంపారు. వాటి వల్ల కళ్లతో హావభావాలు పలికించడం ఎలానో నేర్చుకున్నాను.  ప్రతి సన్నివేశానికి షూటింగ్‌ మొదలవ్వడాని కంటే ముందు గంటసేపు రిహార్సిల్స్‌ చేశాను. ఈ సందర్భంగా కోన వెంకట్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఆయన లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు’’ అంటూ వెండితెరపై తన నటనలో ఎలాంటి లోపాలు కనిపించకుండా ఉండటానికి ఎంత కష్టపడిందో వివరించింది సన్నీ లియోని. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని