సన్నీ కొత్త చిత్రం ‘షీరో’

బాలీవుడ్ నటి సన్నీ లియోనీ నటిస్తున్న సరికొత్త చిత్రం ‘షిరో’. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంగా రూపొందుతున్న ఈ సినిమాకి శ్రీజిత్‌ విజయన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకిగాయ్‌ మోషన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమౌతోన్న చిత్రానికి సంబంధించి తాజాగా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

Published : 26 Mar 2021 14:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్ నటి సన్నీ లియోనీ నటిస్తున్న కొత్త చిత్రం ‘షిరో’. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంగా రూపొందుతున్న ఈ సినిమాకి శ్రీజిత్‌ విజయన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకిగాయ్‌ మోషన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమౌతోన్న చిత్రానికి సంబంధించి తాజాగా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. సినిమా గురించి సన్నీ ట్వీటర్‌ వేదికగా స్పందిస్తూ..‘‘సైకాలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘షిరో’లో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది’’ అంటూ వెల్లడించింది.

సినిమాని తెలుగు, తమిళం, మలయాళంతో పాటు హిందీలోనూ విడుదల చేయనున్నారు. సన్నీ తెలుగులో ‘కరెంటు తీగ’ చిత్రంలో అతిథి పాత్రలోనూ, రాజశేఖర్‌ నటించిన ‘గరుడవేగ’ చిత్రంలో ‘‘డియో డియో’’ ప్రత్యేక పాటతో ప్రేక్షకులని మెప్పించింది. ప్రస్తుతం హిందీలో ‘ది బ్యాటిల్‌ ఆఫ్ భీమాగావ్‌’ చిత్రంలో ఓ ఐటెమ్‌ సాంగ్‌లో నటిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని