Hollywood Movies: 30 సూపర్‌హిట్‌ హాలీవుడ్‌ సినిమాలు.. స్ట్రీమింగ్‌ ఒకే చోట

మీరు హాలీవుడ్‌ చిత్రాల అభిమానులా? క్లాసిక్‌ ఇంగ్లిష్‌ సినిమాలను చూడాలనుకుంటున్నారా? ఒకటి కాదు రెండు 30కిపైగా సూపర్‌హిట్‌ ఆంగ్ల చిత్రాలను అందించనుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’.

Published : 04 May 2022 02:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్: మీరు హాలీవుడ్‌ చిత్రాల అభిమానులా? క్లాసిక్‌ ఇంగ్లిష్‌ సినిమాలను చూడాలనుకుంటున్నారా? ఒకటి కాదు రెండు 30కిపైగా సూపర్‌హిట్‌ ఆంగ్ల చిత్రాలను అందించనుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’. ‘అనకొండ’, ‘సాల్ట్‌’, ‘టెర్నినేటర్‌’, ‘మెన్‌ ఇన్‌ బ్లాక్‌’ సిరీస్‌, ‘స్పైడర్‌ మ్యాన్‌’ సిరీస్‌, ‘రెసిడెంట్‌ ఎవిల్‌’ సిరీస్‌లతోపాటు మరికొన్ని హాలీవుడ్‌ సినిమాలను ఈ నెలలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘ఆహా’ ఇప్పటికే.. తమిళం, మలయాళం.. ఇలా చిత్ర పరిశ్రమల్లో ఘన విజయం అందుకున్న సినిమాలను తెలుగులోకి డబ్‌ చేసి, విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆంగ్ల సినిమాను తీసుకొస్తుంది. ఈ హాలీవుడ్‌ మూవీస్‌ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్‌ అవుతాయో తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని