Super Machi: చిరంజీవి అల్లుడి చిత్రం.. ఆసక్తిగా ‘సూపర్‌మచ్చి’ ట్రైలర్‌

ప్రముఖ నటుడు చిరంజీవి అల్లుడు కల్యాణ్‌దేవ్‌ హీరోగా నటించిన చిత్రం ‘సూపర్‌మచ్చి’.

Updated : 12 Jan 2022 15:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు చిరంజీవి అల్లుడు కల్యాణ్‌దేవ్‌ హీరోగా నటించిన చిత్రం ‘సూపర్‌మచ్చి’. రచితారామ్‌ కథానాయిక. పులివాసు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘చూడకుండా లవ్‌ చేసుకునే కాన్సెప్ట్‌ చాలా బాగుంది. ఇందులో ఏదో తెలియని ఫీల్‌ ఉంది’ అని కథానాయిక చెప్పిన డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. హీరోయిన్‌.. హీరోని సర్‌ సర్‌ అని పిలిచే సన్నివేశాలు, కామెడీ ట్రాక్‌, ఎమోషన్‌.. ఆకట్టుకునేలా ఉన్నాయి. కట్‌ చేస్తే, హీరో చేసిన ఓ పొరపాటు వల్ల హీరోయిన్‌ అతన్ని అసహ్యించుకుంటుంది. తన జీవితమే మారిపోతుందని సీరియస్‌ అవుతుంది. కథానాయకుడు చేసిన ఆ తప్పేంటో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఈ చిత్రంలో పృథ్వీ, పోసాని కృష్ణమురళి, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని  రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రిజ్వాన్‌ నిర్మించారు. ఈ సినిమాకు కళ: బ్రహ్మ కడలి, కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు