Super star Krishna: చుక్కల తోటకి వెళ్లిన తార... మళ్లీ దిగిరావా!

‘ఒక కంట గంగ... ఒక కంట యమునా... ఒక్కసారే కలిసి ఉప్పొంగెనూ...’ అంటూ సాగే కృష్ణ సినిమాలోని పాటలాగే ఆయన్ని కడసారి చూసేందుకు వచ్చి కన్నీటి పర్యంతమైంది అభిమాన ప్రపంచం

Updated : 17 Nov 2022 06:53 IST

 సూపర్‌స్టార్‌ కృష్ణకు కన్నీటి వీడ్కోలు

‘ఒక కంట గంగ... ఒక కంట యమునా... ఒక్కసారే కలిసి ఉప్పొంగెనూ...’ అంటూ సాగే కృష్ణ (Super star Krishna) సినిమాలోని పాటలాగే ఆయన్ని కడసారి చూసేందుకు వచ్చి కన్నీటి పర్యంతమైంది అభిమాన ప్రపంచం. చుక్కల తోటకి వెళ్లిన తార... మరోసారి దిగిరావా అంటూ మనసులోనే మూగగా నినదించింది. 360కిపైగా సినిమాలతో వినోదం పంచి, అన్ని విధాలుగా పరిశ్రమని పరుగులు పెట్టించి, గొప్ప వారసత్వాన్ని అందించిన ఘనత కృష్ణ సొంతం. చివరివరకూ సూపర్‌స్టార్‌ అనిపించుకున్న కృష్ణపై గుండెలనిండా అభిమానం నింపుకుని వచ్చిన ప్రేక్షకలోకం, సన్నిహితులు, సినీ, రాజకీయ వర్గాలు... ఆయన సినిమాల్ని, ఆయన పంచిన వినోదాన్ని స్మరించుకుంటూ తుది వీడ్కోలు పలికారు. తెలుగు రాష్ట్రాలతోపాటు, పలు ప్రాంతాల నుంచి వచ్చిన అభిమాన జన సంద్రం మధ్య కృష్ణ అంతిమయాత్ర హైదరాబాద్‌లోని  పద్మాలయ స్టూడియో నుంచి, మహాప్రస్థానం వరకు కొనసాగింది. ఆయన మృతికి సంతాపంగా బుధవారం తెలుగు చిత్రసీమ బంద్‌ పాటించింది. చిత్రీకరణలతోపాటు, పలు చోట్ల ఉదయం ఆట సినీ ప్రదర్శనలు కూడా రద్దయ్యాయి. కృష్ణ అంతిమయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన సన్నిహితులు, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు మహేష్‌, ఆయన కుటుంబాన్ని ఓదార్చారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని