Rajinikanth: వైరల్‌గా రజనీకాంత్‌- కపిల్‌దేవ్‌ ఫొటో.. ఆ సినిమా కోసమే కలిశారు

ఒకే ఫ్రేమ్‌లో రజనీకాంత్‌, కపిల్‌ దేవ్‌ని చూసిన క్రికెట్‌, సినిమా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫొటో వైరల్‌గా మారింది.

Published : 18 May 2023 21:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ (Rajinikanth), దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ (Kapil Dev) కలిసి దిగిన ఈ ఫొటో నెట్టింట ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఇద్దరిని ఒకే ఫ్రేమ్‌లో చూడడంపై అటు సినీ అభిమానులు, ఇటు క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఫొటోలో ముచ్చటిస్తూ కనిపిస్తుండడంతో.. వారు ఎక్కడ, ఎందుకు కలుసుకున్నారని ఫ్యాన్స్‌ ఆరా తీస్తున్నారు.

విష్ణు విశాల్‌, విక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య.. ‘లాల్‌ సలామ్‌’ (lal salaam) సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో రజనీకాంత్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ముంబయిలో జరుగుతోంది. ఆ సినిమా సెట్స్‌లో దిగిన ఫొటోనే వారివురు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో ఫొటోలను పంచుకుంటూ ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. ‘గొప్ప వ్యక్తిని కలవడం గౌరవం’ అని కపిల్‌ వ్యాఖ్యానించగా.. ‘క్రికెట్‌లో ఇండియాకు తొలిసారి వరల్డ్‌ కప్‌ తీసుకొచ్చిన లెజండ్‌తో కలిసి పనిచేస్తుండడం గౌరవం’ అని రజనీ తెలిపారు. అయితే, కపిల్‌ ఆ సినిమాలో నటిస్తున్నారో లేదా కపిల్‌ పాత్రలో తాను నటిస్తున్నారో రజనీకాంత్‌ వెల్లడించలేదు. కపిల్‌ దేవ్‌ ఇప్పటికే.. ‘ఇక్బాల్‌’, ‘83’, ‘డబుల్‌ ఎక్స్‌ఎల్‌’ తదితర సినిమాల్లో గెస్ట్‌ రోల్‌లో సందడి చేసిన సంగతి తెలిసిందే. రజనీకాంత్‌ మరోవైపు ‘జైలర్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. నెల్సన్‌ దిలీప్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఆగస్టు 10న విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు