‘జాతిరత్నాలు’ వీక్షించిన కృష్ణ

అగ్ర కథానాయకుడు, సినీయర్‌ నటుడు సూపర్‌స్టార్‌ కృష్ణ ‘జాతిరత్నాలు’ చిత్రాన్ని తాజాగా వీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోని కృష్ణ కుమారుడు నటుడు నరేష్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు....

Updated : 22 Mar 2021 10:35 IST

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ కృష్ణ ‘జాతిరత్నాలు’ చిత్రాన్ని తాజాగా వీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోని నటుడు నరేష్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ఆయనతో కలిసి ఫుల్‌టైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ వీక్షించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ‘‘సూపర్‌స్టార్‌తో కలిసి ‘జాతిరత్నాలు’ వీక్షించాను. ఆ సినిమా ఓ నవ్వుల బాంబు. భారీ వసూళ్లను రాబట్టిన చిత్రంగా ఆ సినిమా ఖ్యాతి గడించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కథానాయకుడు నవీన్‌పోలిశెట్టి, దర్శకుడు అనుదీప్‌, నిర్మాత నాగ్‌ అశ్విన్‌తోపాటు స్వప్నా సినిమాస్‌ టీమ్‌ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు’’ అని నరేష్‌ పేర్కొన్నారు. మరోవైపు ఈ సినిమాలో నరేష్‌.. హీరోయిన్‌ ఫరియా తండ్రి పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

నవీన్‌ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్‌ దర్శకత్వం వహించారు. రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. నాగ్‌ అశ్విన్‌ నిర్మాత. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 11న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. నవ్వుల వర్షం కురిపిస్తోంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts