MaheshBabu: హైదరాబాద్‌లో ల్యాండైన మహేశ్.. సూపర్ ప్రమోషన్స్ షురూ..!
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన సరికొత్త చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ....
హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన సరికొత్త చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా మే 7న శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అభిమానుల సమక్షంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎవరు పాల్గొననున్నారనే విషయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. మరోవైపు ప్రమోషన్స్‌లో భాగంగా ట్విటర్లో ‘సర్కారువారి పాట’ ఎమోజీ విడుదలైంది. దీంతో ప్రస్తుతం #SarkaruVaariPaata #SVPMania #SVP.. ఈ మూడు హ్యాష్‌ట్యాగ్స్ ట్విటర్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్నాయి.
హైదరాబాద్‌కి మహేశ్..
‘సర్కారువారి పాట’ ప్రమోషన్స్, తదుపరి సినిమా షూటింగ్స్ని దృష్టిలో ఉంచుకుని.. మహేశ్ ఇటీవల వర్క్‌లైఫ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకొన్నారు. కుటుంబంతో కలిసి ప్యారిస్‌కు వెళ్లి వచ్చారు. ఆ టూర్‌కు సంబంధించిన పలు ఫొటోలను ఆయన సతీమణి నమ్రత ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. అయితే, ప్యారిస్ టూర్ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో మహేశ్ పాల్గొంటారా? లేదా? అనే సందేహం అభిమానుల్లో వ్యక్తమవుతోన్న వేళ.. సూపర్‌స్టార్ తన పర్యాటన ముగించుకొని హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కుటుంబంతోపాటు కనిపించారు. ఈ ఫొటోలు చూసిన అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తోన్నారు.
ఆ ముగ్గురేనా..?
‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథులుగా ఎవరు పాల్గొంటారనే విషయంలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు స్టార్ హీరోల పేర్లు కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ డైరెక్టర్స్ ఎవరంటే.. రాజమౌళి, త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్. ఆయా దర్శకులతో మహేశ్‌కు మంచి స్నేహబంధం ఉందని, అందుకే వారు ముగ్గురూ ఈ స్టేజ్‌పై కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి, ఈ వార్తల్లో నిజమెంత తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రజనీ 171 టైటిల్ అనౌన్స్మెంట్.. లోకేశ్ కనగరాజ్ కామెంట్స్ వైరల్
రజనీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘సూర్య44’.. అధికారికంగా ప్రకటించిన హీరో
ప్రముఖ కథానాయకుడు సూర్య తన 44వ చిత్రాన్ని సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్‌పై దిల్‌రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రికార్డు సృష్టించిన మలయాళ చిత్రం.. తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళ హిట్ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగులో విడుదల కానుంది. ఎప్పుడంటే? -
RC17: రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో అదే హైలైట్: రాజమౌళి
రామ్ చరణ్-సుకుమార్ సినిమాపై రాజమౌళి కామెంట్స్ వీడియో వైరల్‌గా మారింది. ఓ సన్నివేశం గురించి ఆయన దానిలో వివరించారు. -
RC17: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మరోసారి రిపీట్ కానున్న హిట్ కాంబో
రామ్ చరణ్ కొత్త చిత్రం ప్రకటించారు. స్టార్ దర్శకుడితో కలిసి మరో ప్రాజెక్టుకు (#RC17) శ్రీకారం చుట్టారు. -
priyadarshi: ప్రియదర్శి- ఇంద్రగంటి కొత్త సినిమా ప్రారంభం
ప్రియదర్శి కొత్త సినిమా సోమవారం ప్రారంభమైంది. -
Kamal Haasan: మూడు చిత్రాల అప్డేట్స్ ఇచ్చిన కమల్ హాసన్.. ‘కల్కి’ గురించి ఏమన్నారంటే!
తాను నటిస్తోన్న సినిమాల అప్డేట్లను కమల్ హాసన్ పంచుకున్నారు. -
upcoming movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
upcoming movies: మార్చి ఆఖరి వారంలో అటు థియేటర్లో పాటు, ఇటు ఓటీటీలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి చిత్రాలు సిద్ధమవుతున్నాయి. -
War 2: వార్2లో కంపోజర్ ప్రీతమ్ భాగం కానున్నారా?
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. -
Double Ismart Movie Update: ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్‌పై రామ్ కామెంట్స్.. ఏమన్నారంటే!
‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) రిలీజ్ డేట్‌పై రామ్ కామెంట్ చేశారు. -
Kalki 2898AD: ‘కల్కి 2898 ఏడీ’.. స్వప్నదత్ ఆసక్తికర కామెంట్స్
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’పై నిర్మాత స్వప్న ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
Devara: ‘దేవర’లో మరాఠీ బ్యూటీ.. తన పాత్ర ఏంటో చెప్పేసిన నటి!
ఎన్టీఆర్ సరసన నటిస్తున్నట్లు మరాఠీ బ్యూటీ శ్రుతి వెల్లడించారు. -
SSMB29: మహేశ్-రాజమౌళి సినిమాపై అంచనాలు పెంచేసిన కార్తికేయ.. ఏమన్నారంటే!
రాజమౌళి-మహేశ్ సినిమాపై ఎస్ఎస్ కార్తికేయ కామెంట్ చేశారు. -
Shiva Rajkumar: ఇది మరో స్థాయిలో ఉంటుంది: రామ్ చరణ్ చిత్రంపై శివ రాజ్‌కుమార్
హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుపై కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ప్రశంసలు కురిపించారు. -
Prithviraj Sukumaran: 72 గంటల పాటు కేవలం నీళ్లు.. బ్లాక్ కాఫీ మాత్రమే తాగా: పృథ్వీరాజ్
Aadujeevitham: పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించిన ‘ఆడుజీవితం’ షూటింగ్ విశేషాలను ఆయన పంచుకున్నారు. -
Pushpa2: ‘పుష్ప2’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన రష్మిక..ఫొటో వైరల్
‘పుష్ప2’ షూటింగ్ ప్రస్తుతం యాగంటిలో జరుగుతున్నట్లు రష్మిక తెలిపారు. -
Dhanush: అందుకు నేను గర్వపడుతున్నా: ధనుష్
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా(Ilaiyaraaja) జీవితాన్ని ఆధారంగా చేసుకుని కోలీవుడ్‌లో ఓ సినిమా రానుంది. బుధవారం నుంచి ఇది పట్టాలెక్కింది. -
RamCharan: అట్టహాసంగా రామ్‌చరణ్ కొత్త సినిమా ప్రారంభం
రామ్‌చరణ్ (Ram Charan) కొత్త సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!