Sarath Babu: సిగరెట్‌ తాగొద్దని శరత్‌బాబు మందలించాడు : రజనీకాంత్‌

నటుడు శరత్‌బాబు(Sarath Babu)కు అగ్రకథానాయకుడు రజనీకాంత్‌ (Rajinikanth) నివాళులర్పించారు. శరత్‌బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Updated : 23 May 2023 15:41 IST

చెన్నై: నటుడు శరత్‌బాబు (Sarath Babu)ను కడసారి చూసేందుకు చెన్నైలోని ఆయన నివాసానికి సినీ తారలు తరలి వచ్చారు. సుహాసిని, రాధిక, శరత్‌కుమార్‌, సూర్య, రజనీకాంత్‌.. ఇలా పలువురు తారలు శరత్‌బాబు పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. అనంతరం మీడియాతో రజనీకాంత్‌ మాట్లాడుతూ.. శరత్‌బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

‘‘శరత్‌బాబుతో నాకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి అనుబంధం ఉంది. నటుడు కాకముందు నుంచే ఆయన నాకు తెలుసు. ఆయన చాలా మంచి వారు. ఎప్పుడూ చిరునవ్వుతోనే కనిపించేవారు. ఆయన ముఖంలో నాకు కోపం కనిపించలేదు. అద్భుతమైన పాత్రల్లో నటించారు. మేమిద్దరం కలిసి పలు చిత్రాల్లో నటించాం. ఆయనకు నేను అంటే ఎంతో ఇష్టం. ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించేవారు. గతంలో ఓ సందర్భంలో నేను సిగరెట్‌ కాల్చడం చూసి.. మానేయమంటూ నన్ను మందలించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా’’ అని రజనీకాంత్‌ తెలిపారు.

ఇక, ఈరోజు మధ్యాహ్నం గిండిలో శరత్‌బాబు అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు అంత్యక్రియలకు సంబంధించిన పనులన్నింటినీ నటి సుహాసిని పర్యవేక్షిస్తున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని