‘మిర్జాపూర్‌’కు సుప్రీం కోర్టు నోటీసులు

ఈ మధ్యకాలంలో ఓటీటీల వేదికగా అలరిస్తున్న వెబ్‌సిరీస్‌లలో ‘మిర్జాపూర్‌’ ఒకటి. ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌ అనే నగరంలో రౌడీ రాజకీయాలు, హత్యలు, అక్రమ వ్యాపారాల నేపథ్యంలో ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు. మొదటి సీజన్‌ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకోవడంతో

Updated : 10 Aug 2022 12:34 IST

ముంబయి: ఈ మధ్యకాలంలో ఓటీటీల వేదికగా అలరిస్తున్న వెబ్‌సిరీస్‌లలో ‘మిర్జాపూర్‌’ ఒకటి. ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌ అనే నగరంలో రౌడీ రాజకీయాలు, హత్యలు, అక్రమ వ్యాపారాల నేపథ్యంలో ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు. మొదటి సీజన్‌ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకోవడంతో రెండో సీజన్‌ను కూడా విడుదల చేశారు. అది కూడా బాగానే అలరిస్తోంది. ఇదంతా ఇలా ఉండగా.. తాజాగా ఈ వెబ్‌సిరీస్‌ నిర్మాతలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. అసలేం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌తో పాటు మిర్జాపూర్‌ ప్రాంతీయ మనోభావాలు, మతవిశ్వాసాలను దెబ్బతీయడం, హింసను ప్రేరేపించేలా వెబ్‌సిరీస్‌లో చాలా సన్నివేశాలు ఉన్నాయంటూ మిర్జాపూర్‌కు చెందిన అరవింద్‌ చతుర్వేది స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతోపాటు సుప్రీం కోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. పిల్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. వెబ్ సిరీస్ నిర్మాత, అమెజాన్ ప్రైమ్ వీడియోకు నోటీసులు జారీ చేసింది. వెంటనే తమ స్పందన తెలియజేయాలని కోరింది. పిటిషనర్‌ ఇచ్చిన జాబితాలో మిర్జాపూర్ నిర్మాతలు రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్, భౌమిక్ గొండాలియా ఉన్నారు.

ఈ వెబ్‌సిరీస్‌లో తమ నగరాన్ని చెడుగా చూపించి మిర్జాపూర్‌ పేరును భ్రష్టుపట్టిస్తున్నారంటూ గతంలో స్థానిక ఎంపీ అనుప్రియపటేల్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. వెబ్‌సిరీస్‌పై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేశారు. బాలీవుడ్‌ నటి కంగన సైతం ఈ వెబ్‌సిరీస్‌ను వ్యతిరేకించింది. ఇందులో పాత్రలను అన్వయించుకొని ఓ యువకుడు ప్రేమపేరుతో ఓ యువతిని హత్య చేసినట్లు తేలడంతో కంగన ఈ సిరీస్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 

కాగా.. ఇటీవల కాలంలో ఓ వెబ్‌సిరీస్‌ వివాదంలో ఇరుక్కోవడం ఇది రెండోసారి. సైఫ్‌ అలీఖాన్‌ నటించిన ‘తాండవ్‌’ వివాదాల్లో ఇరుక్కొని క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు ఎదురుకావడంతో సిరీస్‌లో మార్పులు చేస్తున్నట్లు డైరెక్టర్‌ ప్రకటించారు. తాజాగా.. ‘మిర్జాపూర్‌’ కూడా వివాదాల్లోకి ఎక్కింది. అయితే.. ఈ రెండు వెబ్‌సిరీస్‌లూ అమెజాన్‌ ప్రైమ్‌లోనే ప్రసారం అవుతుండటం గమనార్హం. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌కు గుర్మీత్‌సింగ్‌ దర్శకత్వం వహించారు. పంకజ్‌త్రిపాఠి, అలీఫజల్‌, దివ్యెందు, శ్వేతాత్రిపాఠి, రసికాదుగల్‌ కీలక పాత్రల్లో నటించారు.

ఇవీ చదవండి.

ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ రిలీజ్‌ అప్పుడేనా?

సోనూసూద్‌కు హైకోర్టులో చుక్కెదురు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని