నేను రెండోపెళ్లి చేసుకోవట్లేదు: సురేఖ వాణి

మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టే ఆలోచన తనకు లేదని నటి సురేఖ వాణి స్పష్టం చేశారు. యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సురేఖ తెలుగులో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు....

Published : 22 Feb 2021 01:07 IST

హైదరాబాద్‌: మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టే ఆలోచన తనకు లేదని నటి సురేఖ వాణి స్పష్టం చేశారు. యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సురేఖ తెలుగులో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, సురేఖ త్వరలోనే రెండో వివాహం చేసుకోనున్నారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె కుమార్తె సుప్రీత నిర్ణయం ప్రకారమే సురేఖ మరోసారి ఏడడుగుల వైపు మొగ్గు చూపుతున్నారని నెట్టింట్లో పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తన పెళ్లి వార్తల గురించి నటి సురేఖ స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని.. తాను రెండో వివాహం చేసుకోవడం లేదని చెప్పారు. దాదాపు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో సురేఖ భర్త కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక, సినిమాల విషయానికి వస్తే ‘భద్ర’, ‘దుబాయ్‌ శీను’, ‘బృందావనం’, ‘శ్రీమంతుడు’, ‘బొమ్మరిల్లు’ చిత్రాలు సురేఖకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని