Suriya: సూర్యకు అరుదైన గౌరవం.. ఆస్కార్‌ నుంచి నటుడికి ఆహ్వానం

కోలీవుడ్‌ నటుడు సూర్యకు(Suriya) అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకునే అకాడమీ అవార్డుల (ఆస్కార్‌...

Published : 29 Jun 2022 13:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కోలీవుడ్‌ నటుడు సూర్య(Suriya)కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల (Oscar) ప్రదానోత్సవంలో ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యుడిగా ఉండేందుకు అవకాశం వరించింది. ఈ కమిటీలో సభ్యులుగా ఉండేందుకు ప్రపంచవ్యాప్తంగా 397 మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వీరిలో సూర్య, బాలీవుడ్‌ నటి కాజోల్‌ పేర్లు ఉన్నాయి. 

కోలీవుడ్‌కు చెందిన ఓ నటుడికి ఇలాంటి గౌరవం దక్కడం ఇదే తొలిసారి. ఇక, సూర్య నటించిన ‘జై భీమ్‌’ (Jai Bhim), ‘ఆకాశం నీ హద్దురా’ (Aakasam Nee Haddura) చిత్రాలు గతంలో ఆస్కార్‌ రేసులో నిలిచిన విషయం తెలిసిందే. ఉత్తమ ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఆస్కార్‌ వేదికగా పోటీలో నిలిచిన ఈ రెండు చిత్రాలు అవార్డులను అందుకోలేకపోయాయి. ఆ సమయంలో నిరాశకు గురైన సూర్య ఫ్యాన్స్‌ తాజాగా తమ అభిమాన హీరోకి అకాడమీ నుంచి ఆహ్వానం అందడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని