Suriya: సూర్య ‘ఈ.టి.’ టీజర్‌ అదుర్స్‌.. మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు

‘ఆకాశమే హద్దురా’, ‘జై భీమ్‌’ చిత్రాలతో ఓటీటీ వేదికగా వరుస విజయాలు అందుకున్నారు కథానాయకుడు సూర్య.

Updated : 19 Feb 2022 18:03 IST

హైదరాబాద్‌: ‘ఆకాశమే హద్దురా’, ‘జై భీమ్‌’ చిత్రాలతో ఓటీటీ వేదికగా వరుస విజయాలు అందుకున్నారు కథానాయకుడు సూర్య. ఇప్పుడు ‘ఈటి’తో వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. పాండిరాజ్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శనివారం ఈ చిత్ర తెలుగు టీజర్‌ను విడుదల చేశారు. సూర్య నుంచి ఆశించే అన్ని రకాల మాస్‌ అంశాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ‘నాతో ఉన్న వాళ్లు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు’ అంటూ సూర్య చెబుతున్న సంభాషణలు అలరిస్తున్నాయి. మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సూర్యకు జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తోంది. వినయ్‌రామ్‌, సత్యరాజ్‌, జయప్రకాశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి.ఇమ్మాన్‌ స్వరాలందిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని