Suriya Jyothika: విదేశాల్లో సూర్య-జ్యోతిక అడ్వెంచర్స్.. వీడియో షేర్‌ చేసిన నటి

నటుడు సూర్య, నటి జ్యోతిక దంపతులు విదేశాల్లో అడ్వెంచర్స్‌ చేస్తున్నారు. వర్క్‌ లైఫ్‌ నుంచి కాస్త విరామం తీసుకున్న ఈ జంట తాజాగా సెంట్రల్‌ అమెరికాలోన....

Updated : 24 Jun 2022 13:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సూర్య(Suriya)-జ్యోతిక(Jyothika) దంపతులు విదేశాల్లో అడ్వెంచర్స్‌ చేస్తున్నారు. సినిమా పనుల నుంచి కాస్త విరామం తీసుకున్న ఈ జంట తాజాగా సెంట్రల్‌ అమెరికాలోని కోస్టారికాకు టూర్‌ వెళ్లింది. అటవీ ప్రాంతమైన కోస్టారికాలో ప్రకృతి అందాలను ఆస్వాదించడమే కాకుండా ట్రెక్కింగ్‌, బోటింగ్‌ వంటి సాహసాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోని జ్యోతిక ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ‘‘జీవితమనేది హరివిల్లు లాంటిది. అందులోని రంగుల్ని కనిపెట్టండి. నాకు ఆకుపచ్చ దొరికింది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను, ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది.

ఇక, సినిమాల విషయానికి వస్తే కమల్‌హాసన్‌ నటించిన ‘విక్రమ్‌’లో సూర్య కీలకపాత్ర పోషించారు. ఇందులో ఆయన రోలెక్స్‌(Rolex)గా  అదరగొట్టేశారు. ప్రస్తుతం ఆయన బాలా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే, ‘ఆకాశమే నీ హద్దురా!’ హిందీ వెర్షన్‌లోని కీలకపాత్రలో సూర్య కనిపించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని