Suriya: సూర్య.. కంగువ

సూర్య కథానాయకుడిగా సిరుతాయ్‌ శివ దర్శకత్వంలో ఓ బహుభాషా చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Updated : 17 Apr 2023 07:01 IST

సూర్య (Suriya) కథానాయకుడిగా సిరుతాయ్‌ శివ దర్శకత్వంలో ఓ బహుభాషా చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి ‘కంగువ’ (Kanguva) అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ మేరకు ఆదివారం టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు. కంగువ అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు అని అర్థం. ఈ చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా త్రీడీలో.. పది భాషల్లో రూపొందిస్తున్నాం. అందుకే అన్ని భాషలకు కనెక్టయ్యే టైటిల్‌ ఎంచుకున్నాం. ఇందులో సూర్య చాలా గంభీరంగా కనిపిస్తారు. గోవా, చెన్నైతో పాటు పలు అందమైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నాం. ఇప్పటికే 50శాతం షూటింగ్‌ పూర్తైంది. మరో నెలలో మిగిలిన చిత్రీకరణ పూర్తి చేస్తాం. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే మాస్‌ యాక్షన్‌ చిత్రమిది. పోరాట ఘట్టాలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ఎంతో ప్రాధాన్యముంది. అందుకే నిర్మాణాంతర పనులకు ఎక్కువ సమయం పట్టనుంది. ఈ చిత్రాన్ని 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. చిత్రీకరణ పూర్తయ్యాక విడుదల తేదీపై స్పష్టత ఇస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు. వెట్రి పళనిసామి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని