Suriya: ఆరోజే పేరు విడుదల

సూర్య కథానాయకుడిగా శివ దర్శకత్వంలో ఓ బహుభాషా చిత్రం రూపొందుతోంది. యువీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ కథానాయిక. ఈ చిత్ర టైటిల్‌, విడుదల తేదీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది.

Updated : 07 Apr 2023 07:18 IST

సూర్య (Suriya) కథానాయకుడిగా శివ దర్శకత్వంలో ఓ బహుభాషా చిత్రం రూపొందుతోంది. యువీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ కథానాయిక. ఈ చిత్ర టైటిల్‌, విడుదల తేదీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈ విశేషాల్ని ఈనెల 16న అధికారికంగా వెల్లడించనున్నట్లు చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. విభిన్నమైన యాక్షన్‌ కథాంశంతో ఓ భారీ పీరియాడికల్‌ డ్రామాగా ముస్తాబవుతున్న చిత్రమిది. భారీ బడ్జెట్‌తో త్రీడీలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని పది భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు.

టైటిల్‌ లీక్‌ అయ్యిందా?

తాజాగా ఈ సినిమాకు ‘అగ్నీశ్వరన్‌’ అనే పేరు అనుకుంటున్నారని, టైటిల్‌ లీక్‌ అయ్యింది అంటూ సోషల్‌ మీడియాలో హడావిడి మొదలైంది. మరి నిజంగానే చిత్రబృందం ఈ పేరు పెట్టనుందా? అభిమానులు సృష్టించిన టైటిలా అనేది తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని