Suriya: ప్రభాస్ చేసిన పనికి ఫిదా అయిన తమిళ స్టార్ హీరో..
అతిథులకు ఆతిథ్యం ఇవ్వడంలో తనకు సాటి లేరని నిరూపించుకుంటాడు ప్రభాస్. తాజాగా తమిళ నటుడు సూర్య కూడా ఈ విషయంలో ప్రభాస్‌ను మెచ్చుకున్నారు.
హైదరాబాద్: తమిళనటుడు అయినా టాలీవుడ్‌లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూర్య. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ గొప్పతనాన్ని సూర్య వివరించాడు.
‘‘నేను సినిమా షూటింగ్ కోసం ఓసారి హైదరాబాద్ వెళ్లాను. అప్పుడు ప్రభాస్ నన్ను డిన్నర్‌కు పిలిచాడు. సాయంత్రం 6కు వస్తానని చెప్పా. కానీ నాకు షూటింగ్‌లోనే రాత్రి 11 దాటింది. ప్రభాస్‌కు సారీ చెప్పి తర్వాత కలుద్దామని చెబుదామనుకున్నాను. రాత్రి 11.30కు హోటల్‌లో ప్రభాస్‌ను కలిశాను. హోటల్ డిన్నర్ లేదా ప్రొడక్షన్ హౌస్ మెస్ నుంచో భోజనం తెప్పిస్తారేమో అనుకున్నా. కానీ తను ఇంటి నుంచి వాళ్ల అమ్మ చేసిన భోజనాన్ని తెప్పించాడు. నాకు ఇంకా ఆశ్చర్యమేసిన విషయం ఏమిటంటే నేను వచ్చే వరకు ప్రభాస్ నాకోసం భోజనం చేయకుండా ఎదురుచూశాడు. నా జీవితంలో అంత రుచికరమైన బిర్యానీని ఎప్పుడూ తినలేదు’’ అంటూ ప్రభాస్‌పై పొగడ్తల వర్షం కురిపించాడు.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్‌లో, ఓం రౌత్ డైరెక్షన్‌లో ‘ఆదిపురుష్’లో నటిస్తున్నాడు. వీటితో పాటు ‘ప్రాజెక్ట్ కె’ తో అలరించనున్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Espionage: రష్యాలో అమెరికన్ జర్నలిస్టు అరెస్టు.. ప్రచ్ఛన్న యుద్ధానంతరం మొదటిసారి!
-
World News
African:ఆఫ్రికాలో కొత్త వైరస్.. ముక్కు నుంచి రక్తస్రావమైన 24 గంటల్లోనే ముగ్గురి మృతి
-
Sports News
IPL 2023: ‘ఈ సీజన్లో ఛాంపియన్‌గా నిలిచేది ఆ జట్టే’.. ముంబయి, చెన్నైలకు నో ఛాన్స్!
-
Movies News
Rana Naidu: ‘రానా నాయుడు’.. తెలుగు ఆడియో డిలీట్.. కారణమదేనా?
-
Politics News
Congress: మంత్రి కేటీఆర్, బండి సంజయ్ ట్వీట్లకు తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్
-
Crime News
Robbery: సినిమాలో చూసి.. రూ.47 లక్షలు కాజేసి..!