suriya: సూర్య 39వ చిత్రం ‘జై భీమ్‌’ విడుదల ఎప్పుడంటే..?

ఆయన 39వ చిత్రం ‘జై భీమ్‌’ విడుదల తేదీ ఖరారైంది. ‘‘ న్యాయం కోసం ధైర్యంగా ,విశ్వాసంగా పోరాడే కథ ఇది.. మీ ముందుకు ఈ చిత్రం తీసుకొస్తున్నందుకు గర్వంగా ఉంది. నవంబరు2న ఈ చిత్రం అమెజాన్‌ ఓటీటీ వేదికగా విడుదల కానుంది’’ అని శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సూర్య ప్రకటించారు.

Published : 01 Oct 2021 22:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో సూర్య అభిమానులకు గుడ్‌ న్యూస్‌. ఆయన 39వ చిత్రం ‘జై భీమ్‌’ విడుదల తేదీ ఖరారైంది. ‘‘ న్యాయం కోసం ధైర్యంగా ,విశ్వాసంగా పోరాడే కథ ఇది.. మీ ముందుకు ఈ చిత్రం తీసుకొస్తున్నందుకు గర్వంగా ఉంది. నవంబరు2న ఈ చిత్రం అమెజాన్‌ ఓటీటీ వేదికగా విడుదల కానుంది’’ అని శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సూర్య ప్రకటించారు. ఇటీవల సూర్య నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అమెజాన్‌ ఓటీటీతో భాగస్వామి అయిందని ఆయన ప్రకటించారు. దీపావళి కానుకగా కుటుంబసమేతంగా చూసేందుకు ఈ సినిమా ‘జై భీమ్‌’ ముస్తాబవుతుంది. ఇందులో రజిషా విజయన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాశ్‌రాజ్‌, మణికందన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ‘ఆకాశం నీ హద్దురా’ ఓటీటీలో విడుదలై మంచిటాక్‌నే కాదు.. అవార్డులనూ దక్కించుకుంది. దీంతో  సూర్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో ‘జై భీమ్‌’పై కోలీవుడ్‌, టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది.

రాబోయే 3 నెలలు ..2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నుంచి 3 చిత్రాలు

నిర్మాతగా సూర్య-జ్యోతిక జోరు పెంచారు. ఆయన ప్రొడక్షన్‌ హౌన్‌ నుంచి మరో మూడు ప్రాజెక్ట్స్‌ ఓటీటీలో రాబోయే నెలల్లో సందడి చేయనున్నాయి.

*    ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ‘ఉడన్‌పిరప్పే’ తెలుగులో (రక్తసంబంధం) అక్టోబరు 14న విడుదల కానుంది. ప్రముఖ నటి, సూర్య సతీమణి జ్యోతిక  ఇందులో మెయిన్‌ లీడ్‌. జ్యోతికకు ఇది 50వ చిత్రం కావడం విశేషం. ధైర్యవంతురాలైన తంజావుర్‌ మహిళగా ఇందులో ఆమె కనిపించనుంది. సముద్రఖని, నివేదిత సతీష్‌ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. జాతీయ పురస్కారం అందుకున్న సంగీత దర్శకుడు డి ఇమ్మాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.

* ఓ అబ్బాయితో పాటు అతడి బెస్ట్‌ఫ్రెండ్‌ కథాంశంగా  ‘ఓ మై డాగ్‌’ (తెలుగు, తమిళం) డిసెంబరులో అమెజాన్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో నటులు విజయ్‌కుమార్, అరుణ్‌ విజయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని