Suriya: రోడ్డు ప్రమాదంలో అభిమాని మృతి.. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చిన సూర్య

హీరో సూర్య (Suriya) అభిమాని ఒకరు ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమాని ఇంటికి వెళ్లి అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Updated : 28 Sep 2023 14:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండే హీరోల్లో సూర్య (Suriya)ఒకరు. తాజాగా ఆయన అభిమాని ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సూర్య అతడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాజాగా ఆ ఫొటోలు బయటకు రావడంతో ఆయనపై ఉన్న అభిమానం ఇంకా పెరిగిదంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

చెన్నైలోని ఎన్నూర్‌లో నివసించే అరవింద్‌.. హీరో సూర్యకు వీరాభిమాని. సూర్య ఫ్యాన్స్‌ క్లబ్‌లో కొన్నేళ్లుగా మెంబర్‌ కూడా. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో అరవింద్‌ చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న సూర్య వెంటనే అరవింద్‌ వాళ్ల ఇంటికి వెళ్లారు. అతడి తల్లిదండ్రులతో మాట్లాడి వారిని ఓదార్చి.. వారిలో ధైర్యాన్ని నింపారు. ఇక గతంలోనూ సూర్య అభిమానులు చనిపోతే ఆయన వాళ్ల కుటుంబాలకి అండగా ఉంటానని హామీ ఇచ్చిన సందర్భాలున్నాయి. 

ధోనీ సతీమణి నిర్మించిన ‘ఎల్‌జీఎం’ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఇక సినిమాల విషయానికొస్తే సూర్య ప్రస్తుతం ‘కంగువ’లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా త్రీడీలో.. పది భాషల్లో రూపొందిస్తున్నారు. పోరాట ఘట్టాలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రధాన ఆకర్షణగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. వచ్చే ఏడాది ‘కంగువ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని