Suriya: సూర్య తదుపరి చిత్రం విడుదల ఎప్పుడంటే..

తమిళ నటుడు సూర్య సినిమాల వేగాన్ని పెంచారు. ఈనెల2న ఓటీటీ విడుదలైన ‘జైభీమ్‌’తో మంచి విజయాన్ని అందుకున్న ఆయన.. మరో మూడునెలల్లో తదుపరి చిత్రం ‘ఎత్తార్‌కుమ్‌ తున్నిన్‌దవం’ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు

Updated : 30 Jul 2022 14:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళ నటుడు సూర్య సినిమాల వేగాన్ని పెంచారు. ఈనెల2న ఓటీటీ విడుదలైన ‘జైభీమ్‌’తో మంచి విజయాన్ని అందుకున్న ఆయన.. మరో మూడు నెలల్లో  ‘ఎత్తర్కుమ్‌ తునింధవన్‌’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2022 ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదలకానుంది. ఇదే విషయాన్ని ట్విటర్‌ వేదికగా తెలియజేస్తూ ఓ వీడియోని విడుదల చేసింది నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌. తెల్ల పంచె, చొక్క ధరించి మాస్‌ బీట్‌కి అదిరిపోయే డ్యాన్స్‌ స్టెప్స్‌ వేస్తూ ఈ వీడియోలో కనిపించారు సూర్య. యాక్షన్‌ థ్రిల్లర్‌లో సాగే ఈ చిత్రానికి పాండిరాజ్‌ దర్శకత్వం వహించారు. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. ఆర్‌. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. డి. ఇమ్మాన్‌ స్వరాలు సమకూర్చగా..  ప్రముఖ తమిళ నటుడు శివకార్తికేయన్‌, నిర్మాత, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ ఈ సినిమా పాటలకు సాహిత్యమందించడం విశేషం.  వినయ్‌ రాయ్‌, ప్రియాంక అరుల్‌ మోహన్‌,  శరణ్య, ఎం.ఎస్‌ భాస్కర్‌ కీలక పాత్రలు పోషించారు. కరోనా కారణంగా సూర్య నటించిన రెండు చిత్రాలు ‘ ఆకాశం నీ హద్దురా’ ‘జై భీమ్‌’ ఓటీటీ బాట పట్టాయి. పరిస్థితులు మళ్లీ అదుపులోకి రావడంతో ఈ సినిమా థియేటర్లలో విడుదలకానుంది. సుమారు రెండేళ్ల తర్వాత వెండితెరపై సూర్య కనిపించడంతో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందానని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు