Updated : 19/11/2021 17:15 IST

Suriya: సూర్య తదుపరి చిత్రం విడుదల ఎప్పుడంటే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళ నటుడు సూర్య సినిమాల వేగాన్ని పెంచారు. ఈనెల2న ఓటీటీ విడుదలైన ‘జైభీమ్‌’తో మంచి విజయాన్ని అందుకున్న ఆయన.. మరో మూడు నెలల్లో  ‘ఎత్తర్కుమ్‌ తునింధవన్‌’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2022 ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదలకానుంది. ఇదే విషయాన్ని ట్విటర్‌ వేదికగా తెలియజేస్తూ ఓ వీడియోని విడుదల చేసింది నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌. తెల్ల పంచె, చొక్క ధరించి మాస్‌ బీట్‌కి అదిరిపోయే డ్యాన్స్‌ స్టెప్స్‌ వేస్తూ ఈ వీడియోలో కనిపించారు సూర్య. యాక్షన్‌ థ్రిల్లర్‌లో సాగే ఈ చిత్రానికి పాండిరాజ్‌ దర్శకత్వం వహించారు. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. ఆర్‌. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. డి. ఇమ్మాన్‌ స్వరాలు సమకూర్చగా..  ప్రముఖ తమిళ నటుడు శివకార్తికేయన్‌, నిర్మాత, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ ఈ సినిమా పాటలకు సాహిత్యమందించడం విశేషం.  వినయ్‌ రాయ్‌, ప్రియాంక అరుల్‌ మోహన్‌,  శరణ్య, ఎం.ఎస్‌ భాస్కర్‌ కీలక పాత్రలు పోషించారు. కరోనా కారణంగా సూర్య నటించిన రెండు చిత్రాలు ‘ ఆకాశం నీ హద్దురా’ ‘జై భీమ్‌’ ఓటీటీ బాట పట్టాయి. పరిస్థితులు మళ్లీ అదుపులోకి రావడంతో ఈ సినిమా థియేటర్లలో విడుదలకానుంది. సుమారు రెండేళ్ల తర్వాత వెండితెరపై సూర్య కనిపించడంతో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందానని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని