Jai Bhim: రికార్డు సృష్టించిన సూర్య ‘జై భీమ్‌’

నటుడు సూర్య నటించిన ‘జై భీమ్‌’ చిత్రం రికార్డు సృష్టించింది. అమెజాన్‌ ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. దళిత వర్గానికి చెందిన ఓ కుటుంబంపై పోలీసులు అన్యాయంగా చేసిన దాడిని తెరపై .. ఆలోజింపజేలా చిత్రీకరించారు దర్శకుడు టి.జె.జ్ఞానవేల్‌. ప్రముఖ మూవీ రేటింగ్​ సంస్థ ఐఎమ్‌డీబీ (IMDB- Internet Movie Data Base) సినిమాల జాబితాలో ‘జై భీమ్‌’’ టాప్‌ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది...

Updated : 10 Nov 2021 12:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సూర్య నటించిన ‘జై భీమ్‌’ చిత్రం రికార్డు సృష్టించింది. అమెజాన్‌ ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షించింది. దళిత వర్గానికి చెందిన ఓ కుటుంబంపై పోలీసులు అన్యాయంగా చేసిన దాడిని తెరపై ఆలోజింపజేసేలా చిత్రీకరించారు దర్శకుడు టి.జె.జ్ఞానవేల్‌. తాజాగా ఈ చిత్రం ప్రముఖ మూవీ రేటింగ్​ సంస్థ ఐఎండీబీ (IMDB- Internet Movie Data Base) సినిమాల జాబితాలో టాప్‌-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నెల 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా.. 53 వేలకు పైగా ఓట్లతో 9.6 రేటింగ్‌తో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. అటు 97శాతం మంది గూగుల్‌ యూజర్లు ఈ చిత్రం బాగుందంటూ కొనియాడారు.

ప్రపంచంలోని వివిధ భాషల్లో వచ్చిన సినిమా రివ్యూ చూసేందుకు గూగుల్‌ చేయగానే మొదట కనిపించే వాటిల్లో ‘ఐఎమ్‌డీబీ’ రేటింగ్‌ ఒకటి. ఇందులోని టాప్‌ రేటెడ్‌ మూవీస్‌కి ఐఎమ్‌డీబీ యూజర్లు రేటింగ్‌ ఇస్తూ ఉంటారు. నిన్న మొన్నటి వరకూ తొలిస్థానంలో 1994లో విడుదలైన ‘‘ది షాషాంక్ రిడంప్షన్‌’’ ఉండగా.. దాన్ని రెండో స్థానానికి నెట్టి ‘జై భీమ్‌’ తొలి స్థానాన్ని దక్కించుకుంది. ఇక ప్రపంచ ప్రఖ్యాత సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’ మూడో స్థానంలో నిలిచింది. గతేడాది ఓటీటీలో విడుదలైన సూర్య చిత్రం ‘ఆకాశం.. నీ హద్దురా’ సైతం ఐఎమ్‌డీబీ టాప్‌-10 జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ‘జై భీమ్‌’తో సూర్య ఆ హవాను కొనసాగిస్తూ తన సత్తా చాటుతున్నాడు.

రేటింగ్ వారీగా చిత్రాలు..

1. జై భీమ్‌ 9.6/10
2. ది షాషాంక్ రిడంప్షన్ 9.3/10
3. ది గాడ్‌ ఫాదర్‌ 9.2/10
4.సర్దార్‌ ఉద్దమ్‌ 9.0/10
5.ది డార్క్‌ నైట్‌ 9.0/10

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు