Kalki 2898 AD: ‘కల్కి’ ట్రైలర్‌లో ఈ హీరోయిన్‌ను గమనించారా? ఎవరంటే..

‘కల్కి 2898 ఏడీ’లో మరో హీరోయిన్‌ నటించారు. ట్రైలర్‌లో మీరు గమనించారా? ఆమె ఎవరంటే?

Updated : 22 Jun 2024 11:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంలో పలు అతిథి పాత్రలున్నాయని, ఇంతకుముందు వైజయంతీ నెట్‌వర్క్‌ (Vyjayanthi Network) (వైజయంతీ మూవీస్‌, స్వప్న సినిమా) చిత్రాల్లో సందడి చేసిన కొందరు ఆ క్యారెక్టర్లు ప్లే చేస్తున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై చిత్ర బృందం ఇప్పటివరకూ స్పందించలేదు. కానీ, ‘రిలీజ్‌ ట్రైలర్‌’ (Kalki 2898 AD Release Trailer)లో ఓ హీరోయిన్‌ను చూపించి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసింది. మీరు గమనించారా? ఆ నటి మరెవరో కాదు.. మాళవిక నాయర్ (Malvika Nair). గతంలో వైజయంతీ నెట్‌వర్క్‌ బ్యానర్‌లలో తెరకెక్కిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’లోను ఆమె కీలక పాత్రలు పోషించి, మెప్పించారు. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ మూడు చిత్రాల్లో ఆమె నటించడం విశేషం. అదే నెట్‌వర్క్‌లో వచ్చిన ‘అన్నీ మంచి శకునములే’లోనూ ఆమె సందడి చేశారు. ట్రైలర్‌లోని తన లుక్‌ని స్క్రీన్‌షాట్‌ తీసి, అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా మాళవిక ఆనందం వ్యక్తంచేశారు. వాటిని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేస్తూ థ్యాంక్స్‌ చెప్పారు.

కొన్ని రోజుల క్రితం విడుదలైన తొలి ట్రైలర్‌ ద్వారా ఈ సినిమాలో అలనాటి హీరోయిన్‌ శోభన (Shobana) ఉన్నారని తెలిసింది. ఆ తర్వాత చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఆమె లుక్‌ని షేర్‌ చేసింది. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారని రూమర్స్‌ వచ్చాయి. నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్నో సర్‌ప్రైజ్‌లుంటాయని తెలిపారు. మరి, ఆయన ఈ రోల్స్‌ గురించే చెప్పారా, వేరే దాని గురించా? అంటే వేచి చూడాల్సిందే.

‘కల్కి’ ఎవరు? ఆ అవతారం ఎప్పుడు వస్తుంది?సినిమాలో ఏం చూపించబోతున్నారు?

ప్రభాస్‌ (Prabhas) హీరోగా రూపొందిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), కమల్‌ హాసన్‌ (Kamal Haasan), రాజేంద్ర ప్రసాద్‌, దీపికా పదుకొణె (Deepika Padukone), దిశా పటానీ (Disha Patani) కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. కాశీ, కాంప్లెక్స్, శంబల అనే మూడు ప్రపంచాల చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది.

రిలీజ్‌ ట్రైలర్‌ కోసం క్లిక్‌ చేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని