Vikram: కమల్ చిత్రంలో... సూర్య!
కమల్‌హాసన్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్’. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో
కమల్‌హాసన్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్’. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో కథానాయకుడు సూర్య ఓ అతిథి పాత్రలో తళుక్కున మెరవనున్నారని సమాచారం. చిత్ర క్లైమాక్స్‌లో ఆయన పాత్ర తెరపె కనువిందు చేస్తుందని, ఇప్పటికే ఆ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని తెలిసింది. ఈనెల 15న చెన్నైలో జరగనున్న ట్రైలర్ విడుదల వేడుకకు ఆయన హాజరు కానున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. సూర్య గతంలో కమల్ నటించిన ‘మన్మదన్ అంబు’లోనూ అతిథి పాత్రలో సందడి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్