సుశాంత్‌ వికీపీడియాలో ఆ వివరాలు మార్చండి! 

గతేడాది బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఎం.ఎస్‌ ధోని, కేథార్‌నాథ్.. ఇలా పలుచిత్రాలతో ఆకర్షించిన సుశాంత్‌ చనిపోవడానికి కారణం.. ఆత్మహత్యేనని కొందరు.. కాదు హత్యేనని మరికొందరు ఆరోపించారు. సుశాంత్

Published : 21 Jul 2021 01:11 IST

 వికీపీడియా వ్యవస్థాపకులకు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ సోదరి ప్రియాంక విజ్ఞప్తి

ముంబయి: గతేడాది బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఎం.ఎస్‌ ధోని, కేథార్‌నాథ్.. ఇలా పలుచిత్రాలతో ఆకర్షించిన సుశాంత్‌ చనిపోవడానికి కారణం.. ఆత్మహత్యేనని కొందరు.. కాదు హత్యేనని మరికొందరు ఆరోపించారు. సుశాంత్ వికీపీడియాలోనూ అతడి మరణానికి కారణం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఉంది. అయితే సుశాంత్‌ ఆత్మహత్య కేసు విచారణలో ఉండడంతో ఈ విషయాన్ని మార్చాలని సుశాంత్‌ సోదరి ప్రియాంక వీకీపీడియా వ్యవస్థాపకులు జిమ్మి వేల్స్‌, ల్యారీ సాంగర్‌ని అభ్యర్థించారు. ‘‘ నాపేరు ప్రియాంకా సింగ్‌, సుశాంత్‌ సోదరిని. సమాచారం అనేది ఒక శక్తిగా మారిన ప్రస్తుత ప్రపంచంలో వాస్తవాలకు కట్టుబడి ఉండటం నిజంగా గొప్ప విశేషం. అయితే, మీ వికీపీడియాలో సుశాంత్‌ మరణానికి కారణం ‘ఉరివేసుకొని ఆత్మహత్య’ అని ఉంది. మా సోదరుడికి న్యాయం దక్కాలని ‘‘#justiceforSushantSinghRajput’’  పోరాటం చేస్తున్నాం. అలాగే ఇండియా టాప్‌ ఏజెన్సీ సీబీఐ దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతోంది. కాబట్టి సుశాంత్‌ వికీ పేజీలో తన మరణానికి గల కారణం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కాకుండా కేసు విచారణలో ఉన్నట్లు మార్చాలి’’ అని ప్రియాంక పేర్కొన్నారు. 

సుశాంత్‌ ఆత్మహత్య కేసులో అతని ఎత్తు కీలకమని ప్రియాంక పేర్కొన్నారు. వికీపీడియాలో సుశాంత్‌ ఎత్తును 183 సెం.మీగా చేర్చాలని ఆమె తెలిపింది. సుశాంత్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ఎత్తు గురించి పేర్కొన్న వీడియో క్లిప్‌ను ఆమె ట్వీట్‌ చేశారు. అలాగే ఓ ఫొటోషూట్‌లోనూ అతడి ఎత్తుకు సంబంధించిన సమాచారాన్ని ఆమె షేర్‌ చేశారు. గతేడాది జూన్‌ 14న ముంబయిలోని బాంద్రాలో గల తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కేసు విచారణ చేపట్టిన ముంబయి పోలీసులు సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. దీంతో అతని ఆత్మహత్యపై పలు ఆరోపణ రావడంతో ఈ కేసును సీబీఐకి, ఈడీకి అప్పగించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని