Chiranjeevi: చిరంజీవికి రాజ్యసభ సీటంటూ ప్రచారం.. సుస్మిత ఏమన్నారంటే?

తన తండ్రి, నటుడు చిరంజీవికి రాజ్యసభ సీటంటూ జరుగుతున్న ప్రచారంపై సుస్మిత స్పందించారు.

Published : 18 Jun 2024 18:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi)కి రాజ్యసభ సీటు ఆఫర్‌ వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన పెద్ద కుమార్తె సుస్మిత (Sushmita Konidela) స్పందించారు. తాను నిర్మించిన ‘పరువు’ (Paruvu) వెబ్‌సిరీస్‌ ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. తన పరిధిలో లేని అంశాల గురించి అడుగుతున్నారన్నారు. ఆ రూమర్స్‌ వచ్చాయని, అయితే ప్రస్తుతానికి తమ ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌ (పవన్‌ కల్యాణ్‌ విజయం) మూడ్‌లో ఉందని తెలిపారు.  

గతంలోనూ ఇలాంటి ప్రచారమే జరగ్గా.. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు చిరంజీవి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించడంతో చిరు పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, చిరంజీవి, రజనీకాంత్‌ తదితరులు హాజరైన సంగతి తెలిసిందే. అదే వేదికపై పవన్‌ను తీసుకుని ప్రధాని.. చిరంజీవి వద్దకు వెళ్లడం, ఇద్దరి చేతులు పట్టుకుని అభివాదం చేయడం స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. అదే ఈ ప్రచారానికీ దారి తీసింది.

రిలీజ్‌కు ముందే ‘కల్కి’ హవా.. తొలి ఇండియన్ సినిమాగా రికార్డు

చిరంజీవితో సినిమా గురించి సుస్మిత మాట్లాడుతూ.. ‘‘ఆయనతో మూవీ నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నా. దర్శకుడు ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే ప్రకటిస్తానని ఆశిస్తున్నా’’ అని అన్నారు. సినిమాల నిర్మాణంలో తన సోదరుడు రామ్‌ చరణ్‌ (Ram Charan) విలువైన సలహాలు ఇస్తారని తెలిపారు. గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ‘శ్రీదేవి శోభన్‌బాబు’, ‘సేనాపతి’ వంటి చిత్రాలతోపాటు ‘షూట్‌ అవుట్‌ ఎట్‌ ఆలేరు’, ‘పరువు’ వెబ్‌సిరీస్‌లు నిర్మించారు సుస్మిత. ‘ఖైదీ నం. 150’, ‘సైరా’, ‘రంగస్థలం’ తదితర చిత్రాలకు ఆమె కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని