Sushmita Sen: లలిత్‌ మోదీతో డేటింగ్‌.. విమర్శలకు సుస్మిత కౌంటర్‌

మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ ఐపీఎల్‌ ఆద్యుడు లలిత్‌ మోదీతో(Lalit Modi) డేటింగ్‌ విషయంలో తనపై వస్తోన్న విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్ (Sushmita Sen)‌. తాను బాగానే ఉన్నానని,....

Updated : 18 Jul 2022 13:52 IST

నేను బాగానే ఉన్నానంటూ పోస్ట్‌

ఇంటర్నెట్‌డెస్క్: భారత మెగా టీ20 క్రికెట్‌ లీగ్‌ మాజీ ఛైర్మన్ లలిత్‌ మోదీతో(Lalit Modi) డేటింగ్‌ విషయంలో తనపై వస్తోన్న విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్ (Sushmita Sen)‌. తాను బాగానే ఉన్నానని.. తాత్కాలిక ప్రశంసలతో ఆనందం కోసం తాను బతకడంలేదని అన్నారు. ఈ మేరకు ఆమె తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘మన చుట్టూ ఉన్న ప్రపంచం దయనీయంగా మారుతోంది. అది చూస్తుంటే బాధగా ఉంది. కొంతమంది మేధావులు, గాసిప్స్‌ క్రియేట్‌ చేసే అమాయకులు, ఇప్పటివరకూ నన్ను కలవని స్నేహితులు, నాతో పెద్దగా పరిచయంలేని వ్యక్తులు.. ఇలా ప్రతిఒక్కరూ నా జీవితం, వ్యక్తిత్వంపై తమ అమూల్యమైన అభిప్రాయాలు బయటపెడుతున్నారు. నేనొక ‘గోల్డ్‌ డిగ్గర్‌’నని డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నానంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. నాకు బంగారం కంటే వజ్రాలంటేనే ఎక్కువ ఇష్టం. వాటిని నేను కొనుక్కోగలను కూడా. ఇన్ని విమర్శలు వస్తున్నా నాకు అండగా నిలిచిన శ్రేయోభిలాషులు, స్నేహితులకు ధన్యవాదాలు. దయచేసి అందరూ ఒక విషయం తెలుసుకోండి.. మీ సుష్‌ బాగానే ఉంది. ఎందుకంటే తాత్కాలిక మెప్పు కోసం నేను జీవించను’’ అని సుస్మితా రాసుకొచ్చారు.

మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో(Sushmita Sen) తాను డేటింగ్‌లో ఉన్నానంటూ లలిత్‌మోదీ (Lalit Modi) ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన వెలువడిన నాటి నుంచి సుస్మితపై పలువురు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. డబ్బు కోసమే ఆమె ఆయనతో డేట్‌ చేస్తున్నారని కొంతమంది మాట్లాడుకోగా.. మరి కొంతమంది, ఆమె గత ప్రేమకథలపై చర్చించుకుంటున్నారు. ఈక్రమంలోనే ఆమె వారికి కౌంటర్‌ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని