Swapna dutt: ‘అర్జున్‌రెడ్డి’ విషయంలో బాధగా ఉన్నా: స్వప్నదత్
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నిర్మాత స్వప్నదత్. ఈ సినిమాపై నమ్మకం ఉన్నప్పటికీ నిర్మించలేకపోయానని అన్నారు.
హైదరాబాద్: విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన ‘అర్జున్‌రెడ్డి’ (Arjun Reddy) విషయంలో ధైర్యం చేయలేక పోయినందుకు బాధగా ఉన్నట్లు మరోసారి వెల్లడించారు నిర్మాత స్వప్నదత్ (Swapna Dutt). ఆ సినిమా కథ ఎంతో నచ్చినప్పటికీ సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మించలేకపోయినట్లు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
‘‘అర్జున్ రెడ్డి’ కథ నాకెంతో నచ్చింది. ఆ చిత్రాన్ని నిర్మించాలని ఎంతో ఆశ పడ్డాను. కాకపోతే ఆ సమయంలో ధైర్యం చేయలేకపోయినందుకు బాధగానే ఉంది. ఒకవేళ ఆ సినిమా అటూ ఇటూ అయితే ఆడపిల్ల ఇలాంటి సినిమా చేసిందా? అని అంటారని భయపడ్డా. ఇక, ‘పెళ్లి చూపులు’పై నేను ఆసక్తి కనబర్చలేదు. సినిమా ఫార్మాట్ కాస్త భిన్నంగా ఉండటంతో నాకు అర్థం కాలేదు’’ అని స్వప్న తెలిపారు.
‘‘జీవితంలో ప్రతి విషయానికీ నేను సంతోషంగా ఉన్నాను. కెరీర్ పరంగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఒక ఛానల్‌ను ప్రారంభించి విఫలమై.. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాం. అందులో పనిచేస్తోన్న ఉద్యోగుల కోసం కొంతకాలం ఇబ్బందులు పడుతూనే నడిపించాం. చివరికి చేసేది లేక దానిపై ఆశలు వదిలేసుకున్నాం. ఒకప్పుడు పరాజయం పొందడం వల్లే విజయం రుచి మరింత తెలిసింది. మేము మళ్లీ కమ్‌బ్యాక్ కాగలిగామంటే దానికి కారణం ప్రేక్షకులు. వాళ్ల వల్లే మేము తిరిగి నిలబడగలిగాం’’ అని ఆమె వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
NTPC: ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్‌లో ఉత్పత్తి ప్రారంభం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Sajjala: ఆ ఇద్దరు ఎమ్మెల్యేలూ ఎవరో గుర్తించాం : సజ్జల
-
Ap-top-news News
Rains: వచ్చే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
-
Politics News
Andhra News: మండలిలో మారనున్న బలాబలాలు
-
Ap-top-news News
Justice Battu Devanand : జస్టిస్ బట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ