‘స్వాతిలో ముత్యమంత’ ఫుల్‌ సాంగ్‌ చూశారా?

‘స్వాతిలో ముత్యమంత’ గీతం సంగీత ప్రియుల్ని ఎంతగానో అలరించింది. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘బంగారు బుల్లోడు’ సినిమాలోని పాట ఇది. ఇదే టైటిల్‌తో అల్లరి నరేశ్‌, పూజా జవేరి నాయకానాయికలుగా దర్శకుడు గిరి ఓ చిత్రం తెరకెక్కించారు.

Published : 03 May 2021 23:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 90ల్లో వచ్చిన ‘స్వాతిలో ముత్యమంత’ గీతం సంగీత ప్రియుల్ని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘బంగారు బుల్లోడు’ సినిమాలోని పాట ఇది. ఇదే టైటిల్‌తో అల్లరి నరేశ్‌, పూజా ఝవేరి నాయకానాయికలుగా దర్శకుడు గిరి ఓ చిత్రం తెరకెక్కించారు. ఇందులో స్వాతిలో ముత్యమంత పాటని రీమిక్స్‌ చేశారు. తాజాగా ఫుల్‌ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర బృందం.  నరేశ్‌, పూజా స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. రేవంత్‌, నదప్రియ గానం మెప్పిస్తుంది. రాజ్‌-కోటి బాణీలు అందించిన ఈ పాటని సాయి కార్తీక్‌ రీమిక్స్‌ చేశారు. సాహిత్యం: వేటూరి. కామెడీ ప్రధానంగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల్ని మెప్పించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని