Bigg Boss 5: శ్వేత ఎలిమినేట్.. రవికి దూరంగా ఉండాలి.. మానస్‌ డేంజర్‌: శ్వేత

‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’ ఆరో వారంలో హౌస్‌ నుంచి శ్వేత వర్మ ఎలిమినేట్‌ అయ్యారు. ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె

Published : 18 Oct 2021 01:37 IST

హైదరాబాద్‌: ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’ ఆరో వారంలో హౌస్‌ నుంచి శ్వేతా వర్మ ఎలిమినేట్‌ అయ్యారు. ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఈ వారం మొత్తం 10 మంది నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. గత సోమవారం వాడీవేడీ చర్చల మధ్య నామినేషన్‌ ప్రక్రియ జరిగింది. ఈ క్రమంలో షణ్ముఖ్‌, ప్రియాంక‌, లోబో, శ్రీరామ్‌, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీ నామినేట్‌ అయ్యారు. శనివారం లోబో ఎలిమినేట్‌ అయ్యాడంటూ అతడిని సీక్రెట్‌ రూమ్‌లో ఉంచారు. ఆదివారం శ్వేత ఎలిమినేషన్‌ను ప్రకటించారు.

‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’లో తయారు చేసిన బొమ్మలే ఈ వారం హౌస్‌మేట్స్‌ భవితవ్యాన్ని తేల్చాయి. నాగార్జున కూడా అదే విషయం చెప్పారు. నామినేషన్స్‌లో ఉన్న 9 మందికి బొమ్మలు ఇచ్చారు. ఎవరి ఫొటో అయితే బొమ్మలో ఉంటుందో వారు ఎలిమినేట్‌ అవుతారని చెప్పారు. చివరకు శ్వేత-సిరిలు మిగలగా, శ్వేత ఎలిమినేట్‌ అయి, సిరి సేఫ్‌ అయింది. ఇతర హౌస్‌మేట్స్‌తో పోలిస్తే, శ్వేత తొలి నుంచి కాస్త అగ్రెసివ్‌గా ఆడారు. నామినేషన్స్‌ సందర్భంగా ఒకట్రెండు సార్లు శ్వేత సహనం కోల్పోయింది. ఆ తర్వాత నాగార్జున ముందు చెంపలేసుకుంది. ఇక కాజల్‌-శ్వేత తరచూ గొడవ పడుతుండేవారు. టాస్క్‌ల సమయంలో శ్వేత తనదైన ఆటతీరు కనబరిచింది. అయితే, బొమ్మల తయారీ సందర్భంగా రవి సూచన మేరకు ఇంటిలోని కుషన్‌ను కట్‌ చేసి, బొమ్మలు తయారు చేయడంతో కెప్టెన్‌ అయ్యే అర్హత కోల్పోవడంతో పాటు, నాగార్జునతోనూ తిట్లు తిన్నారు. ఇక అనీ మాస్టర్‌ శ్వేతను తన కూతురుగా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె హౌస్‌ వీడి వెళ్లే సమయంలో ఇంటి సభ్యులందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

లోబోకు నాగోపదేశం!

ఇక బిగ్‌బాస్‌ చెప్పేవరకూ లోబో సీక్రెట్‌ రూమ్‌లో ఉండాలని నాగార్జున సూచించారు. చిన్నప్పటి నుంచి తనకి అబద్ధాలు చెప్పటం రాదని, హౌస్‌లోకి వచ్చిన తర్వాత అబద్ధాల మధ్య ఉండలేకపోతున్నానని లోబో చెప్పాడు. దీనికి సంబంధించిన నాగార్జున ‘మొదటి నుంచి నీ జీవితం ఎలాంటి అడ్డంకులు లేకుండానే సాగిందా? సీక్రెట్‌ రూమ్‌లో ఉండి, హౌస్‌లోకి వెళ్లిన తర్వాత ఎలా ప్రవర్తించాలో తెలుసుకో’ అంటూ గీతోపదేశం చేశారు. అందుకు ‘సరే’నంటూ లోబో తలూపాడు.

రవికి దూరంగా ఉండాలి..: శ్వేత

వేదికపైకి వచ్చిన శ్వేత హౌస్‌ జర్నీని నాగార్జున ప్రసారం చేశారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురైంది. ఇక ట్రాఫిక్‌ సిగ్నల్‌ చూపించి, హౌస్‌మేట్స్‌లో ఎవరికి ఏది అన్వయమవుతోంది అడిగారు.

ఎవరికి దూరంగా ఉండాలి.. రవి: తన గేమ్‌ తను చాలా బాగా ఆడుతున్నాడు. ఇటీవల జరిగిన గేమ్‌లో నేను, లోబో దొరికిపోయాం. గేమ్‌ను దృష్టిలో పెట్టుకుని రవికి దూరంగా ఉంటే మంచిది.

అపాయం ఎవరితో... మానస్‌: పోటీ పరంగా మంచి వ్యక్తి. అతడిని అంచనా వేయలేం. అదే మీ బలం.

తక్కువ మాట్లాడాలి.. ఎక్కువ ఆడాలి.. అనీ మాస్టర్‌: అనీ మాస్టర్‌ బాగా ఆడుతున్నారు. పరిస్థితుల బట్టి మారిపోతున్నారు. ఇంకాస్త జాగ్రత్తగా ఆడండి. తక్కువ మాట్లాడి, ఎక్కువ ఆటపై దృష్టి పెట్టాలి. మీరు టాప్‌-5లో ఉండాలని కోరుకుంటున్నా.

రీఛార్జ్‌/పెట్రోల్‌ స్టేషన్‌.. శ్రీరామ్‌ చంద్ర: పాజిటివ్‌గా ఉండు. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి వరకూ అందరినీ అలరించు. నువ్వు మంచి వ్యక్తివి. టాప్‌-5లో ఉండాలని కోరుకుంటున్నా.

గేమ్‌ ఆగిపోయింది(డెడ్‌ ఎండ్‌)..కాజల్: మొదటి వారమే నువ్వు మంచి ప్లేయర్‌ అని చెప్పా. అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ ఐడియాలన్నీ వస్తుంటాయి. కొత్త ఆలోచనలతో నీ ఆట మొదలు పెట్టు.

గేమ్‌ నుంచి డైవర్ట్‌ అయిపోయిన వారు.. విశ్వ: నీకు దగ్గరైన వ్యక్తులందరూ గేమ్‌ నుంచి వెళ్లిపోతున్నారు. నువ్వు దానికి ఎఫెక్ట్‌ అవుతున్నావు. నువ్వు గేమ్‌ ఆడుతున్నావంటే హౌస్‌మేట్స్‌ భయపడతారు. అలాంటి నువ్వు ఇంకా బలంగా ఉండాలి.

యూటర్న్‌.. కాజల్‌..: సన్నీకి కెప్టెన్‌గా అవకాశం ఇస్తానని ఇవ్వలేదు. ఎందుకంటే ఆమె తన గేమ్‌ మాత్రమే ఆడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని