Taapsee Pannu: నేను ఆమెలా ఉంటా.. అందుకే బాలీవుడ్‌లో అవకాశాలు: తాప్సీ

తనకు బాలీవుడ్‌లో ఎక్కువ అవకాశాలు రావడంపై నటి తాప్సీ స్పందించారు. ఆమె ఏం చెప్పారంటే?

Published : 18 Jun 2024 16:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఝుమ్మంది నాదం’ (Jhummandi Naadam) చిత్రంతో తెరంగేట్రం చేసి.. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసింది తాప్సీ (Taapsee Pannu). ఒకానొక సమయంలో టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసి ఇప్పుడు దూరమైంది. ప్రస్తుతం హిందీ చిత్రాల్లోనే నటిస్తోంది. అక్కడ అన్ని అవకాశాలు రావడానికి గల కారణమేంటో స్వయంగా తాప్సీనే వెల్లడించింది. తాజాగా పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఆ సంగతులు పంచుకుంది. ‘‘నటి ప్రీతీ జింటా (Preity Zinta)కు నేను న్యూ వెర్షన్ అని చాలామంది భావిస్తారు. ఆ కారణంగానే నాకు బాలీవుడ్‌లో ఛాన్స్‌లు వస్తున్నాయి. ఆమె ఎంత పాజిటివ్‌ ఎనర్జీతో ఉంటారో అందరికీ తెలుసు. ప్రత్యక్షంగానైనా పరోక్షమైనా హిందీ చిత్ర పరిశ్రమలో ఉండడానికి కారణమైన ప్రీతీకి ఎప్పుడూ అపకీర్తి తీసుకురాను. ఆమెలానే ప్రేక్షకులను అలరించేందుకు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటా’’ అని పేర్కొంది. ఇంజినీరింగ్‌ చదివే సమయంలోనే తనకు టాలీవుడ్‌, కోలీవుడ్‌ నుంచి ఆఫర్లు వచ్చాయని తెలిపింది.

అభ్యంతరకరంగా తాకాడు.. కానీ, ఏం చేయలేకపోయా: అవికా గోర్‌

తెలుగులో తాప్సీ నటించిన చివరి చిత్రం ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ (2022). టాలీవుడ్‌లో మూడేళ్ల గ్యాప్‌ అనంతరం ఆ సినిమా చేసింది. గతేడాది ‘డంకీ’, ‘ధక్‌ ధక్‌’ హిందీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’సహా మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మార్చిలో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని