చావుని ఎగతాళి చేస్తున్నారు: తాప్సీ

నిరసనల్లో మృతి చెందిన అన్నదాతల గురించి హరియాణా వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్‌ చేసిన వ్యాఖ్యలపై నటి తాప్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆకలి తీర్చే రైతుల జీవితాలను అపహ్యాసం చేస్తున్నారని ఆమె అన్నారు. అన్నదాతల నిరసనల్లో మృతి చెందిన....

Published : 15 Feb 2021 11:27 IST

మంత్రి కామెంట్‌పై నటి వ్యాఖ్యలు

ముంబయి‌: నిరసనల్లో మృతి చెందిన అన్నదాతలను ఉద్దేశించి హరియాణా వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్‌ చేసిన వ్యాఖ్యలపై నటి తాప్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆకలి తీర్చే రైతుల జీవితాలను అపహ్యాసం చేస్తున్నారని ఆమె అన్నారు. అన్నదాతల నిరసనల్లో మృతి చెందిన 200 మంది రైతుల గురించి ఇటీవల దలాల్‌ మాట్లాడుతూ.. ‘‘ఇంట్లో ఉంటే మాత్రం వాళ్లు చనిపోకుండా ఉంటారా? కొన్ని లక్షల మంది జనాభాలో 200 మంది చనిపోరా? వాళ్లు తమ ఇష్టపూర్వకంగానే మృతిచెందారు’’ అని వ్యాఖ్యానించారు.

రైతుల మృతిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా వివాదాస్పదమయ్యాయి. దీంతో పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలపై నటి తాప్సీ తాజాగా స్పందిస్తూ.. ‘మనిషి జీవితానికి విలువపోయింది! మన ఆకలి తీరుస్తున్న రైతుల జీవితానికి విలువపోయింది! అన్నదాతల మరణాలను అపహాస్యం చేస్తున్నారు’ అంటూ ట్వీట్‌ చేశారు. మరోవైపు, రైతుల గురించి తాను అన్న మాటలకు మంత్రి దలాల్‌ క్షమాపణలు కోరారు.

ఇదీ చదవండి

నిరసనల వల్ల నటికి భద్రత పెంపు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని