Taapsee: వాస్తవికతకు దగ్గరగా ఉన్న పాత్ర అది

‘నన్ను ప్రభావితం చేసిన పాత్రల్లో ‘జబ్‌ వీ మెట్‌’లో గీత్‌ పాత్ర కూడా ఉంది’ అంటోంది బాలీవుడ్‌ కథానాయిక తాప్సి. గతేడాది ఒకే చిత్రం ‘డంకీ’తో సరిపెట్టుకున్న ఈమె ప్రస్తుతం హిందీలో వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది.

Published : 08 Jul 2024 01:35 IST

న్ను ప్రభావితం చేసిన పాత్రల్లో ‘జబ్‌ వీ మెట్‌’లో గీత్‌ పాత్ర కూడా ఉంది’ అంటోంది బాలీవుడ్‌ కథానాయిక తాప్సి. గతేడాది ఒకే చిత్రం ‘డంకీ’తో సరిపెట్టుకున్న ఈమె ప్రస్తుతం హిందీలో వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సి మాట్లాడుతూ..‘‘జబ్‌ వీ మెట్‌’లో కరీనా కపూర్‌ పోషించిన గీత్‌ పాత్ర ఎంతోమందిని ఎన్నో విధాలుగా ప్రభావితం చేసింది. అందులో నేనొకర్ని. ఆ పాత్ర చిత్రంలోని కొన్ని సందర్భాల్లో సామాజిక అంశాలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ.. వాస్తవికతకు దగ్గర ఉంటుంది. ఈ సినిమా విడుదలైనప్పుడు నేను కాలేజీలో చదువుతున్నా. కరీనాకు కూడా మంచి ప్రశంసల్ని తెచ్చిపెట్టిన ఈ చిత్రం.. కథానాయికలు మంచి పాత్రలు ఎంచుకునే నిర్ణయం అప్పుడే మొదలు పెట్టారేమోనని నా అభిప్రాయం’ అని తెలిపింది. ‘నా మనస్తత్వం గురించి కొందరు ఎగతాళిగా మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు అవి బాధపెట్టినా.. నా జీవితాన్ని ఏ మాత్రం ప్రభావితం చేయలేవు. నా సినీ ప్రయాణంలో నేను ఎంచుకున్న సినిమాల విషయంలోనూ ఎన్నో విమర్శల్ని ఎదుర్కొన్నా. చిత్రాల ఎంపిక పట్ల ఇతరులు చెప్పింది చేయాలని నేననుకోను. నాకు నచ్చినట్టుగా నిర్ణయం తీసుకోవాలనుకుంటా’ అంటూ ముగించింది తాప్సి. ప్రస్తుతం ఈమె నటించిన ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’, ‘ఖేల్‌ ఖేల్‌ మే’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని