Taapsee: నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదు: తాప్సి

బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌(Karan Johar) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్‌ కరణ్‌’షోపై ఎటాక్‌ చేశారు నటి తాప్సీ పన్ను (Taapsee). నటీనటుల శృంగార జీవితంపైనే ఆ షోలో ఎక్కువగా ప్రస్తావిస్తుంటారని ఆమె...

Updated : 08 Aug 2022 14:03 IST

ముంబయి: బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ (Karan Johar) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోపై ఎటాక్‌ చేశారు నటి తాప్సీ పన్ను (Taapsee). నటీనటుల శృంగార జీవితాలపైనే ఆ షోలో ఎక్కువగా ప్రస్తావిస్తుంటారని ఆమె పరోక్షంగా చెప్పుకొచ్చారు. ‘దోబారా’ (Dobaaraa) ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఆమె ‘కాఫీ విత్‌ కరణ్‌’ (Koffee With Karan Show) షోపై తనదైన శైలిలో స్పందించారు. ‘‘నటీనటులందరూ తమ సినిమాలను ప్రమోట్‌ చేసుకోవడానికి కరణ్‌ షోలో పాల్గొంటున్నారు. మరి, ఆ షోలో పాల్గొనడానికి మీకు ఆహ్వానం అందలేదా?’’ అని విలేకరి ప్రశ్నించాడు. ‘కాఫీ విత్ కరణ్‌’కి ఆహ్వానించేలా ఆసక్తికరంగా నా శృంగార జీవితం లేదు’’ అని ఆమె వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ఆమె ఇచ్చిన సమాధానంతో అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు. కరణ్‌ షోపై ఆమె పరోక్షంగా కౌంటర్‌ విసిరిందని మాట్లాడుకుంటున్నారు. 

ఇక, కరణ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి టీవీలో ప్రసారమైన ఈ షో ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరిస్తోంది. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో గత కొన్ని వారాలుగా ప్రసారం అవుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ జాన్వి కపూర్‌ - సారా అలీ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌ - సమంత, ‘లైగర్‌’ జోడీ విజయ్‌ దేవరకొండ - అనన్యా పాండే, ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ జంట కరీనా కపూర్‌, ఆమిర్‌ ఖాన్‌ పాల్గొన్నారు. ఇప్పటివరకూ ప్రసారమైన అన్ని ఎపిసోడ్స్‌లోనూ నటీనటుల ప్రైవేటు లైఫ్‌పైనే కరణ్‌ ఎక్కువగా ఫోకస్‌ చేసి, ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. పనిలో పనిగా కరణ్‌ కూడా ఇబ్బందుల పాలవుతున్న విషయమూ తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని