Published : 29/11/2021 12:34 IST

Taapsee: అందంగా కనిపించడానికి ఎంతో కష్టపడ్డా: తాప్సీ

ముంబయి: అందంగా కనిపించడం కోసం చిన్నప్పుడు తాను ఎంతో కష్టపడ్డానని నటి తాప్సీ అన్నారు. ‘తప్పడ్‌’, ‘హసీనా దిల్‌రుబ’ వంటి విభిన్న కథా చిత్రాల్లో నటించి బీటౌన్‌లో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్నారు ఈ తార. ప్రస్తుతం మిథాలీ రాజ్‌ బయోపిక్‌లో నటిస్తున్న తాప్సీ తాజాగా ఓ మ్యాగజైన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘‘నా కళ్లు పెద్దగా, చూడచక్కగా ఉండవు. సినిమాల్లో చూపించే హీరోయిన్స్‌లా నా ముక్కు సన్నగా ఉండదు. పెదవులు అందంగా కనిపించవు. ఆఖరికీ జుట్టు కూడా రింగు రింగులుగా కనిపిస్తుండేది. టీవీలో కనిపించే నటీమణులకు సైతం నాలాంటి జుట్టు ఉండదు. దాంతో ఏం చేయాలో అర్థం కాక.. సెలూన్‌కి వెళ్లి కెమికల్స్‌తో హెయిర్‌ని అందంగా చేసుకునేదాన్ని. అలా ఓ రెండుసార్లు చేయించుకున్నాక.. నాకు జట్టు రాలడం ప్రారంభమైంది. దాంతో మళ్లీ వాటి జోలికి పోలేదు. నిజం చెప్పాలంటే.. అందానికి పరిమితులుగా చెప్పుకొనే కొన్నింటికీ నేను సరిపోను. అందుకే ఎన్నో సంవత్సరాల నుంచి నన్ను నేను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ విజయం సాధించలేకపోయాను. జీవితాన్ని ప్రేమతో జీవించాలని.. మనల్ని మనం ఇష్టపడితే తప్పకుండా బాహ్యప్రపంచానికి ఎంతో అందంగా కనిపిస్తామని అర్థమైంది. అప్పటి నుంచి అందంపై నా అభిప్రాయం మారింది’’ అని తాప్పీ తెలిపారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని